జూన్ 22తో మొదలయ్యే వారపు పట్టిక
జూన్ 22తో మొదలయ్యే వారం
పాట 22, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 1-2 (8 నిమి.)
నం. 1: 1 రాజులు 1:15-27 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: నిజక్రైస్తవులు ఎందుకు సంతృప్తిగా, సంతోషంగా ఉంటారు?—igw 23వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
నం. 3: కాలేబు—అంశం: ఎల్లప్పుడూ తనను అనుసరించేవాళ్లను యెహోవా శక్తిమంతుల్ని చేస్తాడు—సంఖ్యాకాండం 13:6, 30; 14:6-9; యెహో 14:6-11; 15:13-19; న్యాయా 1:11-15; 3:9-11 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము.”—ద్వితీ. 32:7.
15 నిమి: మనం ఏమేం చేశాం? చర్చ. కార్యదర్శి చేస్తారు. జ్ఞాపకార్థ ఆచార సమయంలో సంఘం ఏమేం చేసిందో చెప్పి మెచ్చుకోండి. ఆహ్వాన పత్రాలు ఇచ్చేటప్పుడు ఎదురైన మంచి అనుభవాలు ప్రేక్షకులను చెప్పమనండి.
15 నిమి: యెహోవా మీ చేతిని ఎలా పట్టుకున్నాడు? (యెష. 41:13) ఎంతోకాలంగా నమ్మకంగా సేవచేస్తున్న ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. దేవుని సేవలో వాళ్లకు ఎదురైన సమస్యలను అధిగమించడానికి యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో చెప్పమనండి.
పాట 16, ప్రార్థన