కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/15 పేజీ 2
  • ప్రగతి సాధిస్తూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రగతి సాధిస్తూ ఉండండి
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘బహుగా ఫలించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ప్రకటనాపనిలో అంతకంతకూ నైపుణ్యవంతులవండి
    మన రాజ్య పరిచర్య—2008
  • శిష్యులను చేయడానికి ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఇంకను అభివృద్ధి చెందుటకు అనుకూలమైన చర్య
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2015
km 1/15 పేజీ 2

ప్రగతి సాధిస్తూ ఉండండి

1. మనం పరిచర్యలో తప్పక ప్రగతి సాధించాలని మొదటి శతాబ్దంలోని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

1 క్రైస్తవులు తప్పకుండా పరిచర్యలో ప్రగతి సాధించాలి. అందుకే ప్రకటనా పనిలో తన శిష్యుల నైపుణ్యాలు మెరుగయ్యేలా యేసు వాళ్లకు శిక్షణ ఇచ్చాడు. (లూకా 9:1-5; 10:1-11) అకుల, ప్రిస్కిల్ల అపొల్లోను ‘చేర్చుకొని దేవుని మార్గాన్ని ఆయనకు మరి పూర్తిగా విశదపరచింది’ కూడా అందుకే. (అపొ. 18:24-26) తన అభివృద్ధి “అందరికి తేటగా కనబడు నిమిత్తము” బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండమని అనుభవమున్న సువార్తికుడైన తిమోతిని పౌలు ప్రోత్సహించడానికి కారణం కూడా అదే. (1 తిమో. 4:13-15) సువార్త ప్రచారకులుగా మనం ఎంతకాలం నుండి ప్రభువును సేవిస్తున్నా, పరిచర్యలో మన నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూనే ఉండాలి.

2. ఇతరుల నుండి మనమెలా నేర్చుకోవచ్చు?

2 ఇతరుల నుండి నేర్చుకోండి: ఇతరుల నుండి నేర్చుకుంటూ మన నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు. (సామె. 27:17) కాబట్టి, తోటి ప్రచారకులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంటివాళ్లతో చక్కగా మాట్లాడే ప్రచారకులను సలహాలు అడగండి, వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. (సామె. 1:5) ఆసక్తి చూపించిన ఒకరితో ఎలా మాట్లాడాలో, బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టాలో, ఫలానా పద్ధతిలో పరిచర్య ఎలా చేయాలో అంతుపట్టడం లేదా? అయితే, మీరే చొరవ తీసుకొని, గుంపు పర్యవేక్షకుణ్ణిగానీ అనుభవమున్న ప్రచారకుణ్ణిగానీ మీకు సహాయం చేయమని అడగండి. మన సామర్థ్యాలు పెరగడానికి యెహోవా పరిశుద్ధాత్మ కూడా సహాయం చేస్తుంది, కాబట్టి దాని కోసం అడుగుతూ ఉండండి.—లూకా 11:13.

3. ఫలానా విషయంలో మెరుగవ్వాలని చెప్తే లేదా అడగకపోయినా సలహా ఇస్తే ఏంచేయాలి?

3 ఫలానా విషయంలో మెరుగవ్వాలని మీకు చెప్తే లేదా మీరు అడగకపోయినా సలహా ఇస్తే కోపం తెచ్చుకోకండి. (ప్రసం. 7:9) అపొల్లోలా వినయంతో దాన్ని స్వీకరించండి, కృతజ్ఞత చూపించండి. అది తెలివైన పని.—సామె. 12:15.

4. ఏ చక్కని కారణాన్నిబట్టి మనం సువార్తికులుగా ప్రగతి సాధిస్తూ ఉండాలని యేసు చెప్పాడు?

4 దేవునికి మహిమ వస్తుంది: పరిచర్యలో ప్రగతి సాధించమని యేసు తన అనుచరులకు ఒక ఉదాహరణతో చెప్పాడు. తనను ద్రాక్షావల్లితో, అభిషిక్తులైన తన అనుచరులను దాని కొమ్మలతో పోల్చాడు. ఫలించే ప్రతీ కొమ్మ ‘మరి ఎక్కువగా ఫలించేలా’ తండ్రి దాన్ని శుభ్రం చేస్తాడని చెప్పాడు. (యోహా. 15:2) ద్రాక్షతోట యజమాని దాని కొమ్మలు ఎక్కువగా ఫలించాలని కోరుకుంటాడు. అలాగే, మనం “జిహ్వాఫలము” ఫలించే సామర్థ్యం పెంచుకుంటూ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీ. 13:15) మనం సువార్తికులుగా ప్రగతి సాధిస్తూ ఉంటే వచ్చే చక్కని ఫలితం గురించి యేసు ఇలా చెప్పాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును.”—యోహా. 15:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి