ఆగస్టు 4తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 4తో మొదలయ్యే వారం
పాట 54, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 9వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 4-6 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 4:17-33 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అబద్ధ ప్రవక్తల గురించి ముందుగానే చెప్పబడింది; అపొస్తలుల కాలంలోనూ ఉన్నారు—td 3ఎ (5 నిమి.)
నం. 3: యోసేపు తన సహోదరులను పరీక్షించడం —my 24వ కథ (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: ఆగస్టులో పత్రిక అందించండి. చర్చ. ఈ పేజీలో ఉన్న ఉదాహరణ ఉపయోగించి, వారాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పత్రిక ఎలా అందించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి. తర్వాత, ఈ ప్రశ్నలు అడిగి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి: ఆగస్టు నెల వారాంతాల్లో సముచితమైనప్పుడు మనం పత్రిక ఎందుకు అందించాలి? అలాంటి సముచితమైన కొన్ని సందర్భాలు చెప్పండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనం ఏమి సాధించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు ఎలా సాక్ష్యమివ్వవచ్చు?” అనే ఆర్టికల్లోని అంశాలను పాటించడంవల్ల ఎలా ప్రయోజనం పొందారో ప్రచారకులను చెప్పమనండి. తమకు ఎదురైన చక్కని అనుభవాలను పంచుకోమని ప్రేక్షకులను అడగండి.
పాట 28, ప్రార్థన