కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/13 పేజీ 1
  • వివేచనతో సువార్త ప్రకటించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వివేచనతో సువార్త ప్రకటించండి
  • మన రాజ్య పరిచర్య—2013
మన రాజ్య పరిచర్య—2013
km 10/13 పేజీ 1

వివేచనతో సువార్త ప్రకటించండి

1 వేర్వేరు నమ్మకాల, నేపథ్యాల ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వివేచన ఉపయోగించడం ఎంత అవసరమో అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పాడు. ఈ రోజుల్లో కొందరు, దేవుని మీద నమ్మకం ఉందని చెప్పుకుంటారు. ఇంకొందరికి దేవుడన్నా, మతమన్నా ఏమాత్రం ఆసక్తి ఉండదు. అయితే మనం సువార్త ప్రచారకులం కాబట్టి, “అందరికి” నచ్చేలా రాజ్య సందేశాన్ని ప్రకటించాలంటే వివేచన ఉపయోగించాలి.—1 కొరిం. 9:19-23.

2 ఇంటివాళ్లను అర్థంచేసుకోండి: పరిచర్యలో, ఇంటివాళ్ల అభిరుచులకు తగినట్లు మన మాటల్ని మలచుకోవాలంటే వివేచన కావాలి. అలా మలచుకోవాలంటే మనం చక్కగా సిద్ధపడాలి. అందుబాటులో ఉన్న పుస్తకాలు, పత్రికల్లోని వివిధ అంశాల గురించి బాగా తెలుసుకొనివుంటే, మనం ప్రజలకు సువార్తను ఎన్నో రకాలుగా పరిచయం చేయవచ్చు. మనం వృద్ధులు, యౌవనులు, కుటుంబ పెద్దలు, గృహిణులు, పనిచేసే స్త్రీల వంటి అనేక రకాల వాళ్లను కలుస్తాం. కాబట్టి వాళ్లకు ప్రకటిస్తున్నప్పుడు వాళ్లవాళ్ల పరిస్థితులను మనసులో ఉంచుకొని వాళ్లకు నచ్చే సమాచారం గురించి మాట్లాడాలంటే మనం వివేచన చూపించాలి.

3 మీరు ఒక ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడి పరిసరాలను గమనించండి. అలాచేస్తే, ఇంటివాళ్లకు పిల్లలున్నారా? వాళ్లు ఏ మతస్థులు? ఇంటిని చక్కదిద్దుకోవడమంటే వాళ్లకు బాగా ఇష్టమా? లాంటి విషయాలు మీకు అర్థం కావచ్చు. అప్పుడు మీరు వాళ్ల పరిస్థితులకు, అభిరుచులకు తగినట్లు మాట్లాడగలుగుతారు. వివేచనతో నేర్పుగా ప్రశ్నలు అడుగుతూ, వాళ్లు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వింటే వాళ్ల నమ్మకాలు, మనోభావాలు మీకు తెలిసే అవకాశముంది. దానివల్ల, చర్చను ఎలా కొనసాగిస్తే బావుంటుందో మీకు అర్థమౌతుంది.

4 వాళ్లకు తగినట్లు మాట్లాడండి: మీరు ఒక ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఆటబొమ్మలు గానీ పిల్లలు గానీ కనిపిస్తే, ఇలా అనవచ్చు: “మేము ఈ ప్రాంతంలోని తల్లిదండ్రుల్ని కలిసి, వాళ్లు తమ పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పిస్తున్నారో తెలుసుకుంటున్నాం. స్కూళ్లలో సరైన నైతిక విలువలు నేర్పించడం లేదని చాలామంది తల్లిదండ్రులు ఆందోళనపడుతున్నారు. అది నిజమేనని మీకూ అనిపిస్తోందా?” వాళ్లు ఏమి చెబుతారో వినండి. వాళ్లకు ఈ విషయం గురించి ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే, మీరిలా అనవచ్చు: “ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనకూ మన పిల్లలకూ జ్ఞానవంతమైన నిర్దేశం అవసరమని బైబిలు చెబుతోంది. ఇక్కడ సామెతలు 14:12లో ఏముందో చూడండి.” లేఖనం చదివిన తర్వాత మీరిలా అనవచ్చు: “బైబిలు సలహాలు ఎంత ఉపయోగకరమైనవో తెలిపే ఒక పుస్తకాన్ని నేను ఈమధ్యే చదివాను.” బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని 14వ అధ్యాయానికి తెరిచి, వాళ్లకు సరిపోయే పేరాను చర్చించండి.

5 మనం యెహోవా సేవ కోసం ముందుగా సిద్ధపడి, వివేచన చూపిస్తే అపొస్తలుడైన పౌలు లాగే ఇలా అనగలుగుతాం: “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.”—1 కొరిం. 9:22; సామె. 19:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి