“మీరు మావి తీసుకుంటేనే, మేము మీవి తీసుకుంటాం”
ప్రకటనా పనిలో మనం కలిసే కొందరు అలా అంటారు. అయితే, మన ప్రచురణలు ప్రజలకు ఇస్తున్నప్పుడు, తప్పుడు బోధలు వ్యాప్తి చేసే పుస్తకాలను మనం వాళ్ల దగ్గర తీసుకోం. కాబట్టి, అలాంటి సందర్భాల్లో మనం చాకచక్యంగా ఎలా జవాబివ్వొచ్చు? (రోమా. 1:25) మనం ఇలా చెప్పవచ్చు: “మీవి మాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అయితే, మానవ సమస్యల పరిష్కారం గురించి ఈ పుస్తకం ఏమి చెబుతోంది? [వాళ్లేమి చెప్తారో వినండి. కొన్నిసార్లు, తమ పుస్తకాన్ని స్వయంగా చదివి తెలుసుకోమని వాళ్లు మనల్ని కోరే అవకాశం ఉంది. అలాంటప్పుడు, మన ప్రచురణలోని వివరాలను తెలిపాకే మనం దాన్ని వాళ్లకు ఇచ్చామని వాళ్లకు గుర్తుచేయండి. ఆ తర్వాత మత్తయి 6:9, 10 చదవండి లేదా ఉల్లేఖించండి.] దేవుని రాజ్యం వచ్చాక, ఈ భూమ్మీద ప్రతీది దేవునికి నచ్చినట్లే జరుగుతుందని యేసు చెప్పాడు. కాబట్టి, మేము దేవుని రాజ్యం గురించి చెప్పే ప్రచురణలే చదువుతాం. భవిష్యత్తులో దేవుని రాజ్యం చేసే కొన్ని పనుల గురించి మీకు బైబిలు నుండి చూపించవచ్చా?”