సెప్టెంబరు 9తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 9తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 18వ అధ్యా., 1-10 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 కొరింథీయులు 10–16 (10 నిమి.)
నం. 1: మొదటి కొరింథీయులు 14:7-25 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అపరిపూర్ణ మానవులు యెహోవా హృదయాన్ని ఎలా మెత్తబర్చవచ్చు?—2 దిన. 33:12, 13; యెష. 55:6, 7 (5 నిమి.)
నం. 3: ఒక అందమైన తోట—my 2వ కథ (5 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?—1వ భాగం. జీవితంలో మీరేమి చేస్తారు? అనే కరపత్రంలోని 1-9 పేరాల ఆధారంగా ఇచ్చే ప్రసంగం. రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి కృషి చేస్తున్న యౌవనులను ప్రేమగా ప్రశంసించండి.
10 నిమి: మంచివార్త బ్రోషుర్ ఉపయోగిస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు. చర్చ. బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ఈ బ్రోషుర్ ఉపయోగిస్తున్నప్పుడు ఎదురైన చక్కని అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి. అంతకుముందు పత్రికలు తీసుకున్న వాళ్లను కలిసి, ఈ బ్రోషుర్ ఉపయోగించి ఎలా పునర్దర్శనం చేయవచ్చో చూపించే ఓ ప్రదర్శన చేయించండి.—మార్చి 2013 మన రాజ్య పరిచర్య, 7వ పేజీ చూడండి.
10 నిమి: “ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—ఆమోసు.” ప్రశ్నాజవాబులు.
పాట 44, ప్రార్థన