మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రాధాన్యతనివ్వండి
2011 జూలై మొదలుకొని, ప్రతీనెల మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రయత్నించమనే ప్రోత్సాహాన్ని ప్రచారకులు అందుకుంటున్నారు. ఆ విషయంలో సహాయం చేసేందుకే, కావలికోట సార్వజనిక సంచికలో “ఈ బైబిలు ప్రశ్నలకు సమాధానాలు” అనే క్రమంగా వచ్చే శీర్షికను రూపొందించారు. కాబట్టి మొదటి శనివారం జరిగే క్షేత్రసేవా కూటంలో, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ఈ శీర్షికను ఎలా ఉపయోగించవచ్చో చర్చించాలి, ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలి.
మొదటి శనివారం రోజున క్షేత్రసేవా కూటాన్ని ప్రతీ క్షేత్రసేవా గుంపు విడివిడిగా ఏర్పాటు చేసుకోవాలా లేక అన్ని గుంపులు కలిసి రాజ్యమందిరంలో ఏర్పాటు చేసుకోవాలా అన్నది పెద్దలు నిర్ణయించుకోవచ్చు. అయితే, ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగించుకుంటుంటే, అన్ని గుంపులు కలిసి క్షేత్రసేవా కూటాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కేటాయించిన ఈ రోజును ఏ సంఘమూ వేరే రోజుకు మార్చకూడదు.