దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2013 ఆగస్టు 26తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీ ప్రశ్న చివర్లో, దాన్ని చర్చించబోయే తేదీ ఉంది. మీరు ప్రతీ వారం పాఠశాలకు సిద్ధపడేటప్పుడు దాని గురించి కూడా పరిశోధన చేయవచ్చు.
1. ప్రజలు తగని విధంగా తనను ఘనపరుస్తున్నప్పుడు హేరోదు రాజు దాన్ని ఆనందంగా అంగీకరించాడు. ఆ సందర్భం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (అపొ. 12:21-23) [జూలై 1, w08 5/15 32వ పేజీ, 7వ పేరా]
2. క్రైస్తవ యువతీయువకులు తిమోతి జీవితాన్ని పరిశీలించి, ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? (అపొ. 16:1, 2) [జూలై 8, w08 5/15 32వ పేజీ, 10వ పేరా]
3. ఎఫెసు సమాజమందిరంలో అపొల్లో ‘ధైర్యంగా మాట్లాడడం’ చూసిన అకుల, ప్రిస్కిల్లలు ఆయనకు ప్రేమతో ఎలా సహాయం చేశారు? (అపొ. 18:24-26) [జూలై 15, w10 6/15 11వ పేజీ, 4వ పేరా]
4. యెహోవాసాక్షులు, ప్రకటించే తమ హక్కును కాపాడుకోవడానికి తమ దేశాల్లోని కోర్టులను ఉపయోగించుకోవడానికి ఎలాంటి లేఖనాధారం ఉంది? (అపొ. 25:10-12) [జూలై 22, w03 10/1 15వ పేజీలోని బాక్సు]
5. పౌలు రోమాలో బంధించబడి ఉన్నప్పుడు ఎలా సాక్ష్యమిస్తూనే ఉన్నాడు? ఆ విషయంలో నేటి యెహోవా సేవకులు పౌలును ఎలా అనుకరించవచ్చు? (అపొ. 28:17, 23, 30, 31) [జూలై 29, w12 1/15 12, 13 పేజీలు; 18, 21 పేరాలు]
6. మనం ఎందుకు సువార్త ప్రకటిస్తాం? (రోమా. 1:14, 15) [ఆగస్టు 5, w08 6/15 30వ పేజీ, 2వ పేరా]
7. సా.శ. 33లో విమోచన క్రయధనం చెల్లించబడక ‘పూర్వము చేయబడిన పాపాలు’ “క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా” ఎలా క్షమించబడవచ్చు? (రోమా. 3:24, 25) [ఆగస్టు 5, w08 6/15 29వ పేజీ, 6వ పేరా]
8. దేనికోసం ప్రార్థించాలో తెలియనంతగా కలవరపెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి యెహోవా ఎలాంటి ప్రేమపూర్వక ఏర్పాటు చేశాడు? (రోమా. 8:26, 27) [ఆగస్టు 12, w08 6/15 30వ పేజీ, 10వ పేరా]
9. ‘శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి’ అనే మాటకు అర్థమేమిటి? (రోమా. 12:13) [ఆగస్టు 19, w09 10/15 5-6 పేజీలు, 12-13 పేరాలు]
10. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, మనం ఎలా ‘ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవచ్చు’? (రోమా. 13:14) [ఆగస్టు 26, w05 1/1 11-12 పేజీలు, 20-22 పేరాలు]