జూన్ 10తో మొదలయ్యే వారపు పట్టిక
జూన్ 10తో మొదలయ్యే వారం
పాట 51, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 13వ అధ్యా., 11-18 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 1-4 (10 నిమి.)
నం. 1: అపొస్తలుల కార్యములు 1:15–2:4 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యేసు అద్భుతాలు చేశాడు—bm 21వ పేజీ (5 నిమి.)
నం. 3: ప్రజల ఆలోచనను విషపూరితమైన గాలితో ఎందుకు పోల్చవచ్చు?—ఎఫె. 2:1, 2 (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: కళ్లలోకి చూస్తూ మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం? పరిచర్య పాఠశాల పుస్తకంలోని 124వ పేజీలోని 1వ పేరా నుండి 125వ పేజీలోని 4వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. ప్రచారకుడు కళ్లల్లోకి సరిగ్గా చూడకుండా సాక్ష్యం ఇస్తున్నట్లు క్లుప్తంగా ఒక ప్రదర్శన చేయించండి. తర్వాత అదే ప్రచారకుడు చక్కగా కళ్లల్లోకి చూస్తూ సాక్ష్యమిస్తున్నట్లుగా మరో ప్రదర్శన చేయించండి.
10 నిమి: మనం ఏమి చేశాం? కార్యదర్శి నిర్వహించే చర్చ. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో సంఘం ఏమి సాధించిందో చెప్పి, చేసిన సేవ బట్టి వాళ్లను మెచ్చుకోండి. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాలను పంచిపెట్టినప్పుడు లేదా సహాయ పయినీరు సేవ చేసినప్పుడు ఎదురైన మంచి అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: “పరిస్థితికి తగినట్లు మారడానికి సిద్ధంగా ఉన్నారా?” ప్రశ్నాజవాబులు.
పాట 14, ప్రార్థన