వీడియోలు ఉపయోగిస్తూ బోధించండి
యెహోవా దేవుడు అబ్రాహాముకు, యిర్మీయాకు ప్రాముఖ్యమైన విషయాలను చెబుతున్నప్పుడు, కొన్నిసార్లు వాటికి సంబంధించినవి చూపిస్తూ మాట్లాడాడు. (ఆది. 15:5; యిర్మీ. 18:1-6) అలాగే, మన విద్యార్థులు బైబిలు సత్యాలను చక్కగా అర్థం చేసుకుని, ఎక్కువ ప్రయోజనం పొందేందుకు మనం కూడా వాళ్లకు మన సంస్థ తయారుచేసిన వీడియోల లాంటివి చూపించవచ్చు. విద్యార్థికి ఆంగ్లంగానీ మన వీడియోలు అందుబాటులో ఉన్న మరేదైనా భాషగానీ తెలిసుంటే అలా చూపించడం మంచిది. ఏ వీడియో ఎప్పుడు చూపిస్తే బావుంటుందో కింద కొన్ని సలహాలు ఉన్నాయి. అయితే, ఇవి సూచనలేగానీ నియమాలు కాదని గమనించండి. ఎందుకంటే, విద్యార్థులందరూ ఒకేలా ఉండరు.
బైబిలు బోధిస్తోంది పుస్తకం
◻ 1వ అధ్యాయం: 17వ పేరా తర్వాత, ద వండర్స్ ఆఫ్ క్రియేషన్ రివీల్ గాడ్స్ గ్లోరి చూపించండి
◻ 2వ అధ్యాయం: అయిపోయిన తర్వాత, ద బైబిల్ —మ్యాన్‌కైండ్స్ ఓల్డెస్ట్ మోడర్న్ బుక్ చూపించండి
◻ 9వ అధ్యాయం: 14వ పేరా తర్వాత, జెహోవాస్ విట్నెసెస్—ఆర్గనైజ్డ్ టు షేర్ ద గుడ్ న్యూస్ చూపించండి
◻ 14వ అధ్యాయం: అయిపోయిన తర్వాత, ద బైబిల్—ఇట్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్ చూపించండి
◻ 15వ అధ్యాయం: 10వ పేరా తర్వాత, అవర్ హోల్ అసోసియేషన్ ఆఫ్ బ్రదర్స్ చూపించండి
“దేవుని ప్రేమ” పుస్తకం
◻ 3వ అధ్యాయం: 15వ పేరా తర్వాత, యంగ్ పీపుల్ ఆస్క్—హౌ కెన్ ఐ మేక్ రియల్ ఫ్రెండ్స్? చూపించండి
◻ 4వ అధ్యాయం: అయిపోయిన తర్వాత, రెస్పెక్ట్ జెహోవాస్ అథారిటీ చూపించండి
◻ 7వ అధ్యాయం: 12వ పేరా తర్వాత, నో బ్లడ్—మెడిసిన్ మీట్స్ ద ఛాలెంజ్ చూపించండి
◻ 9వ అధ్యాయం: 6వ పేరా తర్వాత, వార్నింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ డే చూపించండి
◻ 17వ అధ్యాయం: అయిపోయిన తర్వాత, ‘వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్’ చూపించండి
ఇవేకాదు, ఇతర వీడియోలు కూడా మీ విద్యార్థికి ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు, వ్యతిరేకత ఎదుర్కొంటున్న బైబిలు విద్యార్థులు, ఫెయిత్‌ఫుల్ అండర్ ట్రయల్స్—జెహోవాస్ విట్నెసెస్ ఇన్ ద సోవియట్ యూనియన్ లేదా జెహోవాస్ విట్నెసెస్ స్టాండ్ ఫర్మ్ ఎగెయ్‌నిస్ట్ నాజీ అసాల్ట్ వంటి వీడియోలు చూసి ప్రోత్సాహం పొందవచ్చు. యువతీయువకులైతే, పర్స్యూ గోల్స్ దట్ హానర్ గాడ్, యంగ్ పీపుల్ ఆస్క్—వాట్ విల్ ఐ డు విత్ మై లైఫ్? వంటి వీడియోలు చూసి ప్రయోజనం పొందవచ్చు. ఏ అధ్యాయం జరిగేటప్పుడు ఏ వీడియో చూపించాలో, లేదా ఇవ్వాలో వంటి వివరాల్ని మీరు ఉపయోగించే బైబిలు బోధిస్తోంది, “దేవుని ప్రేమ” పుస్తకాల్లోని ఆయా అధ్యాయాల దగ్గర రాసి పెట్టుకుంటే మీరు మర్చిపోకుండా ఆ పని చేయగలుగుతారు. అంతేకాక, కొత్త వీడియోలు ఏవైనా విడుదలైతే, మీ విద్యార్థుల హృదయాలను స్పృశించేలా వాటిని ఎలా ఉపయోగించవచ్చో కూడా ఆలోచించండి.—లూకా 24:32.