మీరు సమాచార బోర్డును ఎప్పటికప్పుడు చూస్తున్నారా?
పెద్దలు, పరిచర్య సేవకులు, సంఘంలో బాధ్యతలున్న మరితరులు తమకు ఎప్పుడు, ఏ నియామకం ఉందో తెలుసుకోవడానికి సమాచార బోర్డును ఎప్పటికప్పుడు చూస్తుంటారు. అయితే, సంఘంలోని వాళ్లందరికీ ఉపయోగపడే సమాచారం అందులో ఉంటుంది. రాజ్యమందిరాన్ని శుభ్రం చేసేపనిలో మీ వంతు ఎప్పుడో మీకు తెలుసా? ప్రాంతీయ పర్యవేక్షకుని నుండి లేదా బ్రాంచి కార్యాలయం నుండి సంఘానికి ఏదైనా ముఖ్యమైన ఉత్తరం వచ్చిందా? మీ బైబిలు విద్యార్థుల్ని కూటానికి ఆహ్వానించేలా ఈ వారం బహిరంగ ప్రసంగ అంశం మీకు తెలుసా? కూటాల సమయాల్లో గానీ క్షేత్రసేవా గుంపుల్లో గానీ ఏమైనా మార్పులు జరిగాయా? ఇక మీదట ఇలాంటి విషయాల్ని కూటాల్లో ప్రకటించరు, అంతేకాక ఇవన్నీ ప్రతీ ప్రచారకునికి విడివిడిగా చెప్పడం సంఘ పెద్దలకు చాలా కష్టం. కాబట్టి, సమాచార బోర్డును మనం ఎప్పటికప్పుడు చూస్తుండాలి. అలా మనకుమనమే తాజా సమాచారం తెలుసుకుంటుంటే అన్నీ “మర్యాదగాను క్రమముగాను” జరుగుతాయి.—1 కొరిం. 14:39, 40.