దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2013 ఏప్రిల్ 29తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీ ప్రశ్న చివర్లో, దాన్ని చర్చించబోయే తేదీ ఉంది. మీరు ప్రతీ వారం పాఠశాలకు సిద్ధపడేటప్పుడు దాని గురించి కూడా పరిశోధన చేయవచ్చు.
1. మార్కు 10:6-9లో, వివాహ బంధానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయాన్ని యేసు గుర్తుచేశాడు? [మార్చి 4, w08 2/15 30వ పేజీ, 8వ పేరా]
2. యెహోవాను “పూర్ణాత్మతో” సేవించడం అంటే ఏమిటి? (మార్కు 12:30) [మార్చి 4, w97 10/15 13వ పేజీ, 4వ పేరా]
3. మార్కు 13:8లో యేసు చెప్పిన “వేదనలు” ఏమిటి? [మార్చి 11, w08 3/15 12వ పేజీ, 2వ పేరా]
4. లూకా సువార్త రాయడానికి లూకా ఏ గ్రంథాలను పరిశోధించాడు? (లూకా 1:3) [మార్చి 18, w09 3/15 32వ పేజీ, 4వ పేరా]
5. సాతాను మన యథార్థతను పరీక్షించడానికి “తగిన సమయము” కోసం చూస్తాడని మనకు తెలుసు కాబట్టి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (లూకా 4:13, క్యాతలిక్ అనువాదము) [మార్చి 25, w11 1/15 23వ పేజీ, 10వ పేరా]
6. లూకా 6:27, 28లోని మాటలను మనం ఎలా పాటించవచ్చు? [మార్చి 25, w08 5/15 8వ పేజీ, 4వ పేరా]
7. యేసు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించక ముందే, ఈ లేఖనంలోని స్త్రీ చేసిన పాపాలను ఎలా క్షమించగలిగాడు? (లూకా 7:37, 48) [ఏప్రి. 1, w10 8/15 6-7 పేజీలు]
8. క్రీస్తు అనుచరులు ఏ భావంలో తమ బంధువులను ‘ద్వేషించాలి’? (లూకా 14:26) [ఏప్రి. 15, w08 3/15 32వ పేజీ, 1వ పేరా]
9. “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు” మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? (లూకా 21:25) [ఏప్రి. 22, w97 4/1 15వ పేజీ, 8-9 పేరాలు]
10. మనకు తీవ్రమైన పరీక్షలు ఎదురైనప్పుడు, యేసులానే మనం ఎలా ప్రార్థించవచ్చు? (లూకా 22:44) [ఏప్రి. 29, w07 8/1 6వ పేజీ, 2వ పేరా]