ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జనవరి, ఫిబ్రవరి: ఈ బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మార్చి, ఏప్రిల్: కావలికోట పత్రిక. ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.
▪ 2013 మార్చి నుండి 2013 ఆగస్టు మధ్యకాలంలో ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇచ్చే బహిరంగ ప్రసంగ శీర్షిక, “అన్ని దేశాల, తెగల, భాషల ప్రజలకు సువార్త.”