దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2012 అక్టోబరు 29తో మొదలయ్యే వారంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీవారం పాఠశాలకు సిద్ధపడుతున్నప్పుడు పరిశోధన చేసేందుకు వీలుగా ప్రతీ ప్రశ్న పక్కన అది చర్చించబడే తేదీ ఉంటుంది.
1. యెహెజ్కేలు దర్శనంలో చూసిన బలిపీఠం దేనిని సూచిస్తోంది? (యెహె. 43:13-20) [సెప్టెం. 10, w07 8/1 10వ పేజీ, 4వ పేరా]
2. యెహెజ్కేలు దర్శనంలోని నదిలోని నీళ్లు దేనిని సూచిస్తున్నాయి? (యెహె. 47:1-5) [సెప్టెం. 17, w07 8/1 11వ పేజీ, 2వ పేరా]
3. ‘హృదయంలో నిశ్చయించుకున్నాడు’ అన్న మాటలను బట్టి దానియేలు తాను యువకునిగా ఉన్నప్పుడు పొందిన ఆధ్యాత్మిక ఉపదేశం గురించి ఏమి తెలియజేస్తోంది? (దాని. 1:8, NW) [సెప్టెం. 24, w07 9/1 19వ పేజీ, 2వ పేరా]
4. నెబుకద్నెజరు కలలోని మహావృక్షం దేనిని సూచిస్తోంది? (దాని. 4:10, 11, 20-22) [అక్టో. 1, w07 9/1 18వ పేజీ, 5వ పేరా]
5. ప్రార్థనలకు సంబంధించి దానియేలు 9:17-19 ఏమి బోధిస్తోంది? [అక్టో. 8, w07 9/1 20వ పేజీ, 5-6 పేరాలు]
6. 70వ వారపు సంవత్సరాల లేదా సా.శ. 36 ముగింపు వరకు ఏ నిబంధన ‘అనేకులకు స్థిరపర్చబడింది’ లేదా అమలులో ఉంది? (దాని. 9:27) [అక్టో. 8, w07 9/1 20వ పేజీ, 4వ పేరా]
7. ‘పారసీకుల రాజ్యాధిపతి’ తనను ఎదిరించాడు అని దేవదూత దానియేలుతో చెప్పిన దాన్నుండి మనం ఏ ముగింపుకు రావచ్చు? (దాని. 10:13) [అక్టో. 15, w12 1/1 28వ పేజీ, 1-2 పేరాలు]
8. దానియేలు 12:3లోని ప్రవచనం ఎలా నెరవేరుతోంది? [అక్టో. 15, w07 9/1 20వ పేజీ, 8వ పేరా]
9. హోషేయ 4:11 ప్రకారం మితిమీరి త్రాగడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల్లో ఒకటి ఏమిటి? [అక్టో. 22, w04 12/1 20వ పేజీ, 10వ పేరా]
10. హోషేయ 6:6 నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకుంటాం? [అక్టో. 22, w07 9/15 16వ పేజీ, 8వ పేరా; w05 11/15 24వ పేజీ, 11-12 పేరాలు]