ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
కావలికోట జనవరి - మార్చి
“కుటుంబ సమస్యలు ఎక్కువౌతున్న ఈ రోజుల్లో భార్య మీద ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని చూపించడానికి భర్త ఏమి చేయవచ్చు? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయంలో లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూపించమంటారా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే 1 పేతురు 3:7 చదవండి, తర్వాత 30వ పేజీలోని ఆర్టికల్ చూపించండి.] భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవచ్చనే దాని గురించి కొన్ని మంచి సలహాలు ఇందులో ఉన్నాయి.”