ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. ఆసక్తివున్న వాళ్లకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు క్రమంగా హాజరుకాని వాళ్లను తిరిగి కలుసుకుంటున్నప్పుడు వాళ్లకు బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.
▪ జ్ఞాపకార్థ ఆచరణ తర్వాతి వారాంతంలో ఒక ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. దాని అంశం “అంతం మీరు అనుకున్నదానికన్నా ఆలస్యంగా వస్తుందా?”
▪ ఇటీవలి సేవా సంవత్సరపు నివేదికలో పేరుతో సూచించని దేశాలను, కొత్త వార్షికపుస్తకము (ఆంగ్లం) చివరి పేజీలో అడ్రస్ ఇవ్వని దేశాలను సందర్శించాలనుకుంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేదా ఎలాంటి ప్రత్యేక సూచనలు పాటించాలో తెలుసుకోవడానికి మీ బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి. ఆ ప్రాంతంలో, రాజ్య ప్రకటనా పని మీద కొన్ని నిషేధాలు విధించి ఉండవచ్చు. (మత్త. 10:16) కొన్ని దేశాల్లో సందర్శకులుగా వెళ్లినవాళ్లు అక్కడి యెహోవాసాక్షులను లేదా సంఘాలను సంప్రదించడం సబబు కాకపోవచ్చు. వేర్వేరు విధాలుగా సాక్ష్యమివ్వడం, సాహిత్యాలను తీసుకువెళ్లడం వంటి విషయాల్లో మీకు కొన్ని నిర్దేశాలు ఇవ్వవచ్చు. వాటిని పాటిస్తే మీరు అనవసరమైన సమస్యల్లో చిక్కుకోకుండా ఉంటారు, ఆ దేశంలో రాజ్య పనికి ఆటంకం కలిగించకుండా ఉంటారు.—1 కొరిం. 14:33, 39, 40.
▪ jw.org వెబ్‌సైట్‌లోని ఆయా అంశాలు, ఇంగ్లీషులోనే కాకుండా మళయాలంలో కూడా ఇప్పుడు లభ్యమౌతున్నాయి.