జనవరి 23తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 23తో మొదలయ్యే వారం
పాట 30, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 70, 71 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 38-42 (10 నిమి.)
నం. 1: యెషయా 39:1-40:5 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులుగా మన బాధ్యతలకు తగినట్లు జీవించడం —wt 118-119 పేజీలు, 14-16 పేరాలు (5 నిమి.)
నం. 3: లౌకిక విద్యకన్నా దైవిక విద్య శ్రేష్ఠమైనది —ఫిలి. 3:8 (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. ఫిబ్రవరిలో అందించాల్సిన ప్రచురణ గురించి చెప్పండి, దాన్ని ఎలా ఇవ్వవచ్చో ఒకట్రెండు ప్రదర్శనల్లో చూపించండి. తర్వాతి వారం జరిగే సేవాకూటానికి నవంబరు 2006, మన రాజ్య పరిచర్య అనుబంధం తెచ్చుకోమని ప్రచారకులకు గుర్తుచేయండి.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మార్కు 10:17-30 చదివించండి. ఈ వచనాలు మన పరిచర్యలో ఎలా సహాయపడతాయో పరిశీలించండి.
15 నిమి: “అన్ని రకాల ప్రజలకు ప్రకటించండి.” ప్రశ్నాజవాబులు. అనుబంధంలో చూపించిన ప్రతీ బ్రోషుర్‌ను ఏ ఉద్దేశంతో ప్రచురించారో చర్చించండి. మీ ప్రాంతంలోని ప్రజలకు ప్రయోజనకరం అనిపించే రెండు బ్రోషుర్‌లను ఎంపికచేసుకోండి. ఆ రెండు బ్రోషుర్‌లలో ఉన్న అంశాలను చర్చించి, ప్రతీదాన్ని ఎలా అందించవచ్చో ప్రదర్శనలో చూపించండి.
పాట 13, ప్రార్థన