అవి ఏ స్థితిలో ఉన్నాయి?
మనం ఇచ్చే ఏ ప్రచురణ గురించైనా ఆ ప్రశ్న వేసుకోవడం మంచిది. ఏదైనా ప్రచురణ పేజీల చివర్లు నలిగిపోయి, రంగు మారిపోయి, మురికిగా లేదా చినిగిపోయి ఉంటే దానివల్ల మన సంస్థకు చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు దానివల్ల ప్రచురణలోని అద్భుతమైన, ప్రాణాలు కాపాడే సందేశం నుండి గృహస్థుని దృష్టి పక్కకు మళ్లుతుంది.
మన ప్రచురణలను మంచి స్థితిలో ఎలా ఉంచుకోవచ్చు? చాలామంది తమ పరిచర్య బ్యాగులో ఒకేరకమైన ప్రచురణలన్నీ ఒక చోట ఉండేలా సర్దుకోవడం ప్రయోజనకరమని కనుగొన్నారు. ఉదాహరణకు, వాళ్లు ఒక అరలో పుస్తకాలను, ఇంకో అరలో పత్రికలను బ్రోషుర్లను, మరో అరలో కరపత్రాలను పెట్టుకుంటారు. ఇతరులకు సాక్ష్యమిచ్చిన ప్రతీసారి వాళ్లు తమ బైబిలును, ప్రచురణలను జాగ్రత్తగా తిరిగి తమ పరిచర్య బ్యాగులో పెట్టుకుంటారు. అలా అవి పాడవకుండా చూసుకుంటారు. కొందరు ప్రచారకులు తమ ప్రచురణలను ఫోల్డర్లలో లేదా ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టుకుంటారు. మనం దేన్ని ఉపయోగించినా, పాడైన ప్రచురణలు ఇవ్వడం ద్వారా మన పరిచర్యను నిందించేందుకు ఇతరులకు అవకాశం ఇవ్వాలని కోరుకోం.—2 కొరిం. 6:3.