దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2011 అక్టోబరు 31తో మొదలయ్యే వారంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
1. యెహోవా జ్ఞాపికలను మనం ఎందుకు హత్తుకొని ఉండాలి? (కీర్త. 119:60, 61) [w00 12/1 14వ పేజీ, 3వ పేరా]
2. కీర్తన 133:1-3 నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? [w06 9/1 16వ పేజీ, 2వ పేరా]
3. యెహోవా ఏ విధంగా మనల్ని ‘పరిశోధించి తెలుసుకుంటాడు’? ఏ విధంగా మన “నడకను,” “పడకను” ‘పరిశీలన చేస్తాడు’? (కీర్త. 139:1, 3) [w06 9/1 16వ పేజీ, 5వ పేరా; w93 10/1 11వ పేజీ, 6వ పేరా]
4. యెహోవా ఎలాంటి కష్టాల్లో తన సేవకులను ‘ఉద్దరిస్తాడు’ లేదా ‘లేవనెత్తుతాడు’? (కీర్త. 145:14) [w04 1/15 17వ పేజీ, 11వ పేరా]
5. సామెతలు 6:12-14లో ప్రస్తావించబడిన వ్యక్తి పనికిమాలినవాడు అని ఎందుకు పిలువబడ్డాడు? [w00 9/15 26వ పేజీ 5వ పేరా, 27వ పేజీ 1వ పేరా]
6. జ్ఞానవంతుడు ఎందుకు ‘ఉపదేశాన్ని అంగీకరించగలుగుతాడు’? (సామె. 10:8) [w01 7/15 26వ పేజీ, 1వ పేరా]
7. అవమానాలు లేదా అన్యాయమైన విమర్శలు ఎదురైనప్పుడు జ్ఞానవంతులు స్పందించే తీరు మూర్ఖులు స్పందించే తీరుకు ఏవిధంగా వేరుగా ఉంటుంది? (సామె. 12:16) [w03 3/15 27వ పేజీ, 4-5 పేరాలు]
8. “నిత్యము విందు” కలిగివుండేందుకు ఆశావహ దృక్పథం మనకెలా సహాయం చేస్తుంది? (సామె. 15:15) [w06 7/1 16వ పేజీ, 6వ పేరా]
9. ‘బుద్ధి సంపాదించుకోవడంలో’ ఏమి ఇమిడివుంది? (సామె. 19:8) [w99 7/1 18వ పేజీ, 4వ పేరా]
10. వివేచన కుటుంబ సభ్యులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? (సామె. 24:3) [w06 9/15 27వ పేజీ, 11వ పేరా; be 32వ పేజీ, 1వ పేరా]