అక్టోబరు 31తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 31తో మొదలయ్యే వారం
పాట 49, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 46, 47 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సామెతలు 22-26 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. “అవి ఏ స్థితిలో ఉన్నాయి?” ప్రసంగం. ప్రసంగం తర్వాత, 8వ పేజీలోవున్న, “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగంలోని అందింపును ఉపయోగించి నవంబరు నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో ప్రదర్శింపజేయండి.
15 నిమి: పరిచర్యలో హుందాగా కనబడడం ఎందుకు ప్రాముఖ్యం? చర్చ. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 131-134 పేజీల ఆధారంగా ఒక పెద్ద దీన్ని నిర్వహిస్తాడు.
10 నిమి: నవంబరులో పత్రిక ఇవ్వడానికి సిద్ధపడండి. చర్చ. మీ ప్రాంతంలోని వారికి ఆసక్తికరంగా ఉంటాయనిపించే కొన్ని ఆర్టికల్స్ గురించి ఒకట్రెండు నిమిషాలు మాట్లాడండి. ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా అందించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 4, ప్రార్థన