కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/11 పేజీ 2
  • ప్రకటించడానికి వెనుకాడకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటించడానికి వెనుకాడకండి
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • యౌవనస్థులారా—మీ పాఠశాల విద్యాభ్యాస కాలాన్ని సద్వినియోగపరచుకోండి
    మన రాజ్య పరిచర్య—1998
  • మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?
    మన రాజ్య పరిచర్య—2012
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పేరు నమోదు చేయించుకోవడం
    మన రాజ్య పరిచర్య—1996
  • 2002వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
    మన రాజ్య పరిచర్య—2001
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 10/11 పేజీ 2

ప్రకటించడానికి వెనుకాడకండి

1. ఏ పని చేయడానికి ధైర్యం అవసరం? ఎందుకు?

1 ఇతరులు ఎగతాళి చేస్తారనే భయం వల్ల పాఠశాలలో సాక్ష్యమివ్వడానికి మీరెప్పుడైనా వెనుకాడారా? మీరు బిడియస్థులైతే మీ నమ్మకాల గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా ధైర్యం అవసరం. ఈ విషయంలో మీకు ఏది సహాయం చేస్తుంది?

2. పాఠశాలలో సాక్ష్యం ఇచ్చేటప్పుడు మంచి వివేచన ఎందుకు అవసరం?

2 మంచి వివేచన ఉపయోగించండి: పాఠశాలను సాక్ష్యమివ్వడానికి మీకు దొరికిన ప్రత్యేక స్థలంగా చూడడంలో తప్పులేదు. అయితే ఇంటింటి పరిచర్యలో చేసినట్లు, పాఠశాలలో ప్రతీ ఒక్కరితో దేవుని గురించిన విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మంచి వివేచన ఉపయోగించి ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోండి. (ప్రసం. 3:1, 7) మీ తరగతిలో జరిగే చర్చల్లో లేదా పాఠశాలలో జరిగే ఇతర కార్యక్రమాల్లో మీ విశ్వాసాన్ని వ్యక్తం చేసే అవకాశాలు దొరకవచ్చు. లేదా మీరు కొన్ని కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొనరని తోటి విద్యార్థి అడగవచ్చు. కొంతమంది క్రైస్తవులు విద్యా సంవత్సరం మొదట్లోనే, తాము యెహోవాసాక్షులమని టీచర్లకు చెప్పి మన నమ్మకాల గురించి వివరించే కొన్ని ప్రచురణలు ఇచ్చారు. ఇతర విద్యార్థులు ప్రచురణలను చూసి వాటి గురించి ప్రశ్నలు అడిగేలా మరికొంతమంది వాటిని తమ బెంచీ మీద పెట్టారు.

3. పాఠశాలలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు?

3 ముందే సిద్ధపడండి: మీరు ముందే సిద్ధపడితే మరింత ధైర్యంగా మాట్లాడగలుగుతారు. (1 పేతు. 3:15) కాబట్టి ఎలాంటి ప్రశ్నలు ఎదురుకావచ్చో, వాటికి ఎలా జవాబివ్వవచ్చో ఆలోచించండి. (సామె. 15:28) వీలైతే మీ బైబిలును, తర్కించడం (ఆంగ్లం) పుస్తకాన్ని, యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) పుస్తకాలను, సృష్టి గురించిన ఇతర ప్రచురణలను పాఠశాలలో ఉంచుకోండి. అలాచేస్తే అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. వివిధ సందర్భాల్లో ఎలా మాట్లాడాలో కుటుంబ ఆరాధనప్పుడు ప్రాక్టీసు చేయించమని మీ తల్లిదండ్రులను అడగండి.

4. మీరు పాఠశాలలో ఎందుకు సాక్ష్యమిస్తూ ఉండాలి?

4 సానుకూలంగా ఉండండి: మీరు సత్యం గురించి మాట్లాడిన ప్రతీసారి తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తారని అనుకోకండి. మీ ధైర్యం చూసి మెచ్చుకుని కొందరు మీరు చెప్పేది వినవచ్చు కూడా. ఒకవేళ ఎవరూ వినకపోయినా నిరాశపడకండి. మీ ప్రయత్నాలు చూసి యెహోవా సంతోషిస్తాడు. (హెబ్రీ. 13:15, 16) ‘బహు ధైర్యంగా బోధించడానికి’ సహాయం చేయమని ఆయనను అడుగుతూనే ఉండండి. (అపొ. 4:30; 2 తిమో. 1:7, 8) మీరు చెప్పేది ఎవరైనా విన్నప్పుడు మీకు కలిగే సంతోషాన్ని ఒక్కసారి ఊహించుకోండి. చివరికి ఆ వ్యక్తి మీలాగే యెహోవా సేవకుడు అయ్యే అవకాశముంది!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి