ఆగస్టు 29తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 29తో మొదలయ్యే వారం
పాట 48, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 35వ అధ్యాయం (“తన అనుచరులకు ఒక ఉన్నతమైన ప్రమాణము” అనే ఉపశీర్షిక నుండి “జీవమునకు మార్గము” అనే ఉపశీర్షిక వరకు) (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 110-118 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. 8వ పేజీలోవున్న, “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే భాగంలోని అందింపును ఉపయోగించి సెప్టెంబరు నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టాలో ప్రదర్శింపజేయండి. ఈ పనిలో భాగం వహించమని అందర్నీ ప్రోత్సహించండి. “గృహస్థునికి ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా బ్రోషురైనా ఇవ్వవచ్చు” అనే భాగాన్ని ప్రసంగ రూపంలో ఇవ్వాలి.
15 నిమి: ఉద్యోగవిరమణ—అధిక కార్యాలకు అనువైన కాలం. మన రాజ్య పరిచర్య జూన్ 2003, 5వ పేజీ ఆధారంగా చర్చ.
10 నిమి: సెప్టెంబరు నెలలో పత్రిక ఇవ్వడానికి సిద్ధపడండి. చర్చ. పత్రికలోని విషయాల గురించి ఒకట్రెండు నిమిషాలు చెప్పండి. తర్వాత రెండు మూడు ఆర్టికల్స్ ఎంపిక చేసుకొని ఏ ప్రశ్నలు వేస్తే బాగుంటుందో, ఏ లేఖనాలు చూపిస్తే బాగుంటుందో శ్రోతలను చెప్పమనండి. పత్రిక ఎలా పరిచయం చేయవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 31, ప్రార్థన