ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌ను ఎలా ఉపయోగించాలి?
మీరు కలిసిన వాళ్లకు సత్యంపట్ల ఆసక్తి ఉందనిపించినప్పుడు, వాళ్లు మీ ప్రాంతంలో నివసించేవాళ్లు కాకపోతే లేదా వాళ్లు వేరే భాష మాట్లాడే వాళ్లయితే ఈ ఫారమ్‌ను నింపాలి. సాధారణంగా, ఆ వ్యక్తి ఆసక్తి ఉన్నట్లు చూపిస్తే మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. మీరు కలిసిన వ్యక్తి బధిరుడైతే, దగ్గర్లో ఉన్న సంఘంలో సంజ్ఞా భాషా గుంపు ఉంటే ఆ వ్యక్తికి ఆసక్తి ఉన్నా లేకపోయినా S-43 ఫారమ్‌ను నింపాలి.
ఫారమ్‌ను నింపిన తర్వాత దాన్ని మనమేమి చేయాలి? దాన్ని సంఘ కార్యదర్శికి ఇవ్వాలి. దాన్ని ఏ సంఘానికి పంపాలో ఆయనకు తెలిస్తే, ఆసక్తి చూపించిన వ్యక్తికి సహాయం చేయడానికి వీలుగా, ఆ సంఘంలో ఉన్న పెద్దలకు ఇవ్వవచ్చు. ఏ సంఘానికి పంపించాలో నిశ్చయించుకోలేనప్పుడు దాన్ని బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాడు.
సత్యంపట్ల ఆసక్తి చూపించిన వ్యక్తి వేరే భాష మాట్లాడేవాడై మీ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, ఒకవేళ మీ సంఘంలో లేదా దగ్గర్లోని సంఘంలో ఆ భాష మాట్లాడే ప్రచారకుడు/రాలు ఉంటే వాళ్లు ఆయనను కలిసేంతవరకు ఆయనలోవున్న ఆసక్తిని పెంచడానికి మీరే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తూ ఉండవచ్చు.—నవంబరు 2009 మన రాజ్య పరిచర్యలోని 3వ పేజీ చూడండి.