ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జనవరి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా, 1995కు ముందు ప్రచురించిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి పట్టుదలతో ప్రయత్నించండి. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. ఆసక్తిగలవారిని లేదా జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు మాత్రం సరిగ్గా రానివారిని తిరిగి కలుసుకుంటున్నప్పుడు వారికి బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఇవ్వండి. ఈ పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.
▪ ప్రాంతీయ పర్యవేక్షకులు ఫిబ్రవరి నుండి “సత్యం మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది?” అనే కొత్త బహిరంగ ప్రసంగం ఇస్తారు.