కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/10 పేజీ 1
  • ‘భయపడకండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘భయపడకండి’
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • భయాన్ని అధిగమించేలా యెహోవా ప్రేమ సహాయం చేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • యెహోవా మీకు శక్తిని ఇస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • భయం వేస్తే యెహోవా వైపు చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 10/10 పేజీ 1

‘భయపడకండి’

1. యిర్మీయాలాగే మనకు ఎలాంటి భయాలు కలగవచ్చు?

1 యెహోవా తనను ప్రవక్తగా నియమించినప్పుడు, ఆ పని చేయడం తనకు చేతకాదని యిర్మీయా అనుకున్నాడు. కానీ యెహోవా, “భయపడకుము” అని అభయమిచ్చి తాను అప్పగించిన పనిని పూర్తి చేసేలా దయతో ఆయనను బలపరిచాడు. (యిర్మీ. 1:6-10) నేడు కూడా, బిడియం వల్ల, ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల మనం పరిచర్యలో ఎక్కువగా పాల్గొనలేకపోతుండవచ్చు. మనం ప్రకటించే వార్తకు ప్రజలు ఎలా స్పందిస్తారో, మన గురించి వారు ఏమనుకుంటారో అనే భయంతో కొన్నిసార్లు మనం సాక్ష్యం ఇవ్వలేకపోతుండవచ్చు. అయితే, మనం అలాంటి భయాలను ఎలా పోగొట్టుకోవచ్చు? దానివల్ల మనకు ఏ ఆశీర్వాదాలు వస్తాయి?

2. చక్కగా సిద్ధపడితే పరిచర్య విషయంలో మనకున్న భయాలను ఎలా తగ్గించుకోవచ్చు?

2 ముందుగా సిద్ధపడండి: చక్కగా సిద్ధపడితే మనం మన భయాలను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, పరిచర్యలో మనకు అడ్డు చెప్పే వారితో ఎలా మాట్లాడాలో ముందుగానే ఆలోచిస్తే, మనకు అభ్యంతరాలు ఎదురైనప్పుడు సులభంగా జవాబు ఇవ్వగలుగుతాం. (సామె. 15:28) స్కూల్లో, పరిచర్యలో ఎదురయ్యే వివిధ సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేలా మీ కుటుంబ ఆరాధనలో వివిధ సన్నివేశాలను ప్రాక్టీసు చేయండి.—1 పేతు. 3:15.

3. యెహోవాపై నమ్మకముంచడం వల్ల మన భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు?

3 యెహోవాపై నమ్మకం ఉంచండి: యెహోవాపై నమ్మకముంచితే మన భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే, మనకు సహాయం చేస్తానని ఆయన మాటిచ్చాడు. (యెష. 41:9-13) మనం ధైర్యంగా ఉండడానికి ఇంకేమి కావాలి? అంతేకాక, అనుకోని పరిస్థితుల్లోనూ చక్కగా సాక్ష్యమిచ్చేందుకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందని యేసు అభయమిచ్చాడు. (మార్కు 13:11) కాబట్టి, పరిశుద్ధాత్మను ఇవ్వమని యెహోవాకు ప్రార్థిస్తూ ఉండండి.—లూకా 11:13.

4. సమస్యలు వచ్చినప్పటికీ పరిచర్యలో క్రమం తప్పకుండా పాల్గొంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

4 ఆశీర్వాదాలు: మనకు సమస్యలు వచ్చినప్పటికీ పరిచర్యలో క్రమం తప్పకుండా పాల్గొంటే, భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని పొందుతాం. పరిశుద్ధాత్మతో నిండిన వారిలో ఉండే లక్షణాన్ని అంటే ధైర్యాన్ని పెంచుకుంటాం. (అపొ. 4:31) అంతేకాక, యెహోవా సహాయంతో మన భయాలను పోగొట్టుకుంటున్నప్పుడు, ఆయన రక్షణహస్తంపై మనకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటాం. (యెష. 33:2) మనం మన పరలోక తండ్రికి ఇష్టమైనది చేస్తున్నామనే సంతోషాన్ని, సంతృప్తిని కూడా సొంతం చేసుకుంటాం. (1 పేతు. 4:13, 14) కాబట్టి, యెహోవా సహాయం ఎల్లప్పుడూ ఉంటుందనే నమ్మకంతో ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా రాజ్య సువార్తను ప్రకటిద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి