పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జూలై - సెప్టెంబరు
“జీవితంలో మనందరం ఎన్నో బాధలు ఎదుర్కొంటుంటాం. [మీ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని బాధల గురించి ప్రస్తావించండి.] ఆ బాధలను తట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయగలడని మీరు అనుకుంటున్నారా? [వాళ్లు చెప్పేది వినండి. వాళ్లు ఇంకా మాట్లాడడానికి సుముఖంగా ఉంటే, లేఖనాన్ని చూడడానికి ఇష్టపడితే సంభాషణ కొనసాగించండి.] దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడో, ఎలా సహాయం చేస్తాడో ఈ లేఖనం చూపిస్తుంది. [లూకా 11:13 చదవండి.] పరిశుద్ధాత్మ అంటే ఏమిటో, అది మనకెలా ప్రయోజనం చేకూరుస్తుందో ఈ పత్రిక వివరిస్తుంది.”
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“లోకంలో ఇన్ని బాధలు ఎందుకున్నాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? [వాళ్లను చెప్పనివ్వండి.] చాలామంది అడిగిన ప్రశ్ననే ఒక వ్యక్తి ఎలా అడిగాడో మీకు చదివి వినిపించమంటారా? [వాళ్లకు ఆసక్తి ఉంటే, కీర్తన 10:1 చదవండి.] దేవుడు బాధల్ని ఎందుకు అనుమతిస్తున్నాడనే దానిగురించి, వాటిని తీసివేయడానికి ఆయనేమి చేయబోతున్నాడనే దానిగురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయో ఈ పత్రిక వివరిస్తుంది.”