సెప్టెంబరు 20తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
సెప్టెంబరు 20తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 19-22
నం. 1: 2 రాజులు 20:1-11
నం. 2: మనమెందుకు సాత్వికంగా ఉండాలి? (మత్త. 5:5)
నం. 3: మీ జతను కోల్పోయినప్పటి పరిస్థితితో వ్యవహరించడం (fy 170, 171 పేజీలు, 20-22 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: గత సంవత్సరం మనమెలా చేశాం? సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. గత సేవా సంవత్సరంలో సంఘం చేసిన పరిచర్యను పునఃసమీక్షిస్తూ, సంఘం సాధించిన మంచి విషయాల గురించి మాట్లాడి, తగినవిధంగా మెచ్చుకోండి. విశేషమైన అనుభవాలు ఎదురైన ఒకరు లేదా ఇద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. రాబోయే సంవత్సరంలో సంఘం పరిచర్యకు సంబంధించి మెరుగుపర్చుకోగల ఒకట్రెండు విషయాలు ప్రస్తావించండి. మెరుగుపర్చుకునేందుకు పాటించదగిన సలహాలివ్వండి.
10 నిమి: “సేవా కూటంలోని భాగాలను నిర్వహించేవాళ్లకు నిర్దేశాలు.” పెద్ద ఇచ్చే ప్రసంగం.
10 నిమి: మీ పిల్లలు ప్రచారకులవ్వడానికి సహాయం చేయండి. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 82వ పేజీ ఆధారంగా చర్చ. బాప్తిస్మం తీసుకోని ప్రచారకులైన పిల్లలున్న మాదిరికరమైన తండ్రిని లేదా తల్లిని ఇంటర్వ్యూ చేయండి. పిల్లలు ప్రగతి సాధించి, ప్రచారకులుగా అర్హులయ్యేందుకు ఆయన లేదా ఆమె ఎలా సహాయం చేశారు?