క్షేత్రసేవా ముఖ్యాంశాలు
మార్చి 2010
సంతోషకరమైన విషయమేమిటంటే, ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు 87,532 మంది హాజరయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే హాజరైన వారి సంఖ్య 12 శాతం పెరిగింది. మరో సంతోషకరమైన విషయం, మార్చి నెలలో ఐదు విషయాల్లో ముందటికన్నా ప్రగతి సాధించాం. 2,974 మంది క్రమ పయినీర్లతో సహా మొత్తం 33,089 మంది ప్రచారకులు పరిచర్యలో పాల్గొన్నారు. పరిచర్యలో 6,42,608 గంటలు వెచ్చించాం. 2,18,908 పునర్దర్శనాలు చేశాం. 37,748 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించాం.