దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2010 జూన్ 28తో ప్రారంభమయ్యే వారంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2010 మే 3 నుండి జూన్ 28 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. అబ్నేరు గురించి దావీదు దుఃఖించడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (2 సమూ. 3:31-34) [w05 5/15 17వ పేజీ, 6వ పేరా; w06 7/15 21వ పేజీ, 9, 10 పేరాలు]
2. ఇశ్రాయేలుతో యుద్ధం ముగిసిన తర్వాత ఎంతమంది మోయాబీయులు హతమార్చబడ్డారు? (2 సమూ. 8:9) [w05 5/15 17వ పేజీ, 2వ పేరా]
3. ఇష్బోషెతు చంపబడిన తర్వాత ఎంతకాలానికి దావీదు ఇశ్రాయేలంతటిపై రాజుగా చేయబడ్డాడు? (2 సమూ. 5:1, 2) [w05 5/15 17వ పేజీ, 1వ పేరా]
4. దావీదు మెఫీబోషెతు విషయంలో ప్రేమపూర్వక దయను ఎలా చూపించాడు, దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (2 సమూ. 9:7) [w02 5/15 19వ పేజీ, 5వ పేరా]
5. గిత్తీయుడైన ఇత్తయికి దావీదు రాజుకు మధ్యవున్న అనుబంధం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (2 సమూ. 15:19-22) [w09 5/15 27, 28 పేజీలు]
6. మెఫీబోషెతు మీద సీబా వేసిన నింద అబద్ధమని లేఖనాల నుండి మనమెలా చూపించవచ్చు? (2 సమూ. 16:1-4) [w02 2/15 14-15 పేజీలు, 11వ పేరా, అధస్సూచి]
7. దావీదు 80 ఏళ్ల బర్జిల్లయిని తన ఆస్థానంలో ఉండమని కోరినప్పుడు బర్జిల్లయి కింహామును ఎందుకు సిఫారసు చేశాడు? (2 సమూ. 19:33-37) [w07 6/1 24వ పేజీ, 13వ పేరా]
8. యెహోవా సాత్వికము దావీదును ఎలా గొప్పచేసింది? (2 సమూ. 22:36) [w04 11/1 29వ పేజీ]
9. దావీదు బ్రతికి ఉండగానే ఆయన సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి అదోనీయా ఎందుకు ప్రయత్నించాడు? (1 రాజు. 1:5) [w05 7/1 28వ పేజీ, 5వ పేరా]
10. జ్ఞానము, అవగాహన ఇవ్వమని సొలొమోను చేసిన ప్రార్థనకు యెహోవా ఎందుకు జవాబిచ్చాడు? (1 రాజు. 3:9) [w05 7/1 30వ పేజీ, 3వ పేరా]