జూన్ 28తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 28తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 8వ అధ్యా. 19-26 పేరాలు, 106, 109 పేజీల్లోని బాక్సులు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 3-6
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: జూలైలో కావలికోట పత్రిక అందించడానికి సిద్ధపడండి. ప్రేక్షకులతో చర్చ. పత్రికలోని విషయాలను ఒకటి, రెండు నిమిషాలు సమీక్షించండి. ఆ తర్వాత రెండు, మూడు ఆర్టికల్స్ ఎంచుకొని, పత్రిక ఇచ్చేటప్పుడు ఉపయోగించడానికి వీలుగా ఆ ఆర్టికల్స్ నుండి ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చో, ఏయే లేఖనాలను ఉపయోగించవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా అందించవచ్చో ప్రదర్శించి చూపించండి. పునర్దర్శనానికి వెళ్ళి, బైబిలు అధ్యయనం ఎలా ఆరంభించవచ్చో మరో ప్రదర్శనలో చూపించి ముగించండి.—km 8/07 3వ పేజీ చూడండి.
15 నిమి: బాల్యం నుండే శిక్షణ ఇవ్వడం. ప్రేక్షకులతో చర్చ. తిమోతి ఉత్సాహవంతుడైన, నైపుణ్యంగల సువార్తికుడని పేరుగాంచాడు. (ఫిలి. 2:20-22) ఆయన చిన్నప్పుడే ఆయన తల్లి, అమ్మమ్మ వేసిన ఆధ్యాత్మిక పునాది వల్లే కొంతమేర అది సాధ్యమైంది. (2 తిమో. 1:5; 3:15) పిల్లల్ని మంచి సువార్తికులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులకు సహాయం చేయగల లేఖన సలహాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. (1) చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళను పరిచర్యకు తీసుకువెళ్ళండి; వాళ్ళ వయసు, సామర్థ్యానికి తగ్గట్లుగా పరిచర్యలో పాల్గొనేలా వారికి శిక్షణనివ్వండి. (సామె. 22:6) (2) పరిచర్యకు మీరు ప్రథమ స్థానాన్ని ఇస్తారని మీ మాదిరి ద్వారా చూపించండి. (ఫిలి. 1:9, 10) (3) కుటుంబ ఆరాధన సమయంలో, ఇతర సందర్భాల్లో పరిచర్య పట్ల ఇష్టాన్ని, మెప్పును పెంపొందించుకునేందుకు సహాయం చేయండి. (ద్వితీ. 6:6, 7) (4) మీ ప్రవర్తనలో, మాటలో పరిచర్య పట్ల అనుకూల దృక్పథంతో ఉన్నారని చూపించండి. (ఫిలి. 3:8; 4:8; 1 తిమో. 1:12) (5) పరిచర్య చేయడాన్ని ఒక అలవాటుగా చేసుకొని, కుటుంబమంతా కలిసి క్రమంగా పరిచర్యకు వెళ్ళండి. (అపొ. 5:41, 42) (6) పరిచర్య పట్ల ఎక్కువ ఆసక్తి గలవారితో సహవసించండి. (సామె. 13:20) పరిచర్యను ఆనందంగా, ప్రతిఫలదాయకంగా చేయడానికి తమ తల్లిదండ్రులు తమకెలాంటి సహాయం చేశారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.