ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మే: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇతర దైవపరిపాలనా సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించనివారిని, ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని ఇవ్వండి. ముఖ్యంగా బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో ఉండండి. జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే 1995కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు. జూలై, ఆగస్టు: ఈ కింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: అప్రమత్తంగా ఉండండి!, ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు.
▪ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:
బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది —అస్సామీ
వాచ్‌టవర్ లైబ్రరీ—2009 సీడీ
వాచ్‌టవర్ లైబ్రరీ—2009 సీడీ సంఘంలోని ప్రచారకులకు మాత్రమే అనీ, సంఘం ద్వారా మాత్రమే దానిని రప్పించుకోవాలి అనీ దయచేసి గమనించండి.