మే 24తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 24తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 7వ అధ్యా. 10-19 పేరాలు, 93వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 13-15
నం. 1: 2 సమూయేలు 13:23-33
నం. 2: కుటుంబం ఇంకా ఏమి చేయవచ్చు? (fy 145-147 పేజీలు, 9-13 పేరాలు)
నం. 3: మనం లోకాన్ని ఎందుకు అమితంగా అనుభవించకూడదు? (1 కొరిం. 7:31)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: జూన్లో కావలికోట అందించడానికి సిద్ధపడండి. ప్రేక్షకులతో చర్చ. పత్రికలోని విషయాలను ఒకటి, రెండు నిమిషాలు సమీక్షించండి. ఆ తర్వాత రెండు, మూడు శీర్షికలను ఎంచుకొని, పత్రిక ఇచ్చేటప్పుడు ఉపయోగించడానికి వీలుగా ఆ శీర్షికల్లో నుండి ఏ ప్రశ్న, ఏ లేఖనం ఉపయోగించవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా అందించవచ్చో ప్రదర్శించి చూపించండి.
10 నిమి: పరిశుభ్రంగా ఉన్న రాజ్యమందిరం యెహోవాను ఘనపరుస్తుంది. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి ఆయన ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి. (నిర్గ. 30:17-21; 40:30-32) మన ఆరాధనా స్థలం శుభ్రంగా, మంచి స్థితిలో ఉన్నప్పుడు యెహోవా ఘనపర్చబడతాడు. (1 పేతు. 2:12) రాజ్యమందిరం శుభ్రంగా, మంచి స్థితిలో ఉండేలా చూడడానికి నియమించబడిన సహోదరుణ్ణి, స్థానిక ఏర్పాట్ల గురించి ఇంటర్వ్యూ చేయండి. రాజ్యమందిరం పరిశుభ్రంగా మంచి స్థితిలో ఉండడం వల్ల ఆ ప్రాంతంలో సాక్ష్యమివ్వడానికి దారితీసిన అనుభవాలుంటే చెప్పండి లేదా మన ప్రచురణల్లోని అనుభవాలను చెప్పండి. రాజ్యమందిరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ భాగం వహించాలని ప్రోత్సహించండి.
10 నిమి: “‘ఈ సువార్త ప్రకటించబడుతుంది’!” ప్రశ్నాజవాబుల చర్చ.