మార్చి 8తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 8తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 4వ అధ్యా. 12-21 పేరాలు, 48వ పేజీలోవున్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 1-4
నం. 1: 1 సమూయేలు 2:18-29
నం. 2: వైద్య చికిత్సనెలా దృష్టించాలి (fy 124-126 పేజీలు, 19-23 పేరాలు)
నం. 3: చిన్నపిల్లలను యెహోవా ప్రేమిస్తాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. మార్చి 2010 తేజరిల్లు! ఆంగ్ల పత్రిక, 22వ పేజీలో పాము ఆరాధన గురించి ఉన్న ఆర్టికల్లోని సమాచారం కొంతమంది గృహస్థులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. కాబట్టి, క్షేత్రంలో ఈ పత్రికను ఇస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి.
10 నిమి: మీరు చెప్తున్న బైబిలు సందేశం వినబడేలా ఉందా? పరిచర్య పాఠశాల పుస్తకం, 109వ పేజీలోవున్న 2వ పేరా నుండి అధ్యాయం చివరి వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం.
20 నిమి: “అతిగొప్ప బహుమతి ఇచ్చినందుకు దేవునికి ఎలా కృతజ్ఞత చూపించాలి?” ప్రశ్నాజవాబుల చర్చ. 3వ పేరా చర్చించిన తర్వాత, పరిచర్యలో జ్ఞాపకార్థ ఆచరణ ప్రత్యేక ఆహ్వానపత్రికలు పంచిపెట్టడానికి మీ సంఘంలో ఏయే ఏర్పాట్లు చేయబడ్డాయో తెలియజేయండి. క్షేత్రం సమస్యాత్మకంగా ఉంటే, ఆహ్వానపత్రికలు పంచిపెడుతున్నప్పుడు ప్రచారకులు జాగ్రత్తగా, తెలివిగా ఎలా నడుచుకోవాలో వివరించండి. ఒక సహాయ పయినీరు, ఆహ్వానపత్రికను ఇచ్చే ముందు ఇంటివారికి ఆసక్తి ఉందని ఎలా తెలుసుకుంటాడో ఒక ప్రదర్శనలో చూపించాలి. ఆ తర్వాత, ఆయన సహాయ పయినీరు సేవ చేయడానికి ఎలా సర్దుబాట్లు చేసుకున్నాడో, దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందాడో చెప్పమనండి.