పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జనవరి - మార్చి
“దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన మీకు సిరిసంపదలు ఇస్తాడనీ, పేదరికం దేవుని అనుగ్రహం లేదని చెప్పడానికి గుర్తనీ కొంతమంది అంటారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? [వాళ్ళేమి చెబుతారో వినండి.] సిరిసంపదల్ని ప్రేమించడం తప్పని దేవుడు ఎందుకు చెబుతున్నాడో వివరిస్తున్న లేఖనాన్ని మీకు చూపించవచ్చా? [ఇంటివాళ్లకు అభ్యంతరం లేకపోతే, 1 తిమోతి 6:9, 10 చదవండి.] దేవుని సేవకులు ఎలాంటి ఆశీర్వాదాలు పొందవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”