దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2010, ఫిబ్రవరి 22తో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2010 జనవరి 4 నుండి ఫిబ్రవరి 22 మధ్య వారాల్లోని నియామకాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. అబ్రాహాము తండ్రియైన తెరహు విగ్రహాలను ఆరాధించేవాడా? (యెహో. 24:2) [w04 12/1 12వ పేజీ, 1వ పేరా, w01 8/15 16వ పేజీ, 8వ పేరా]
2. యెహోషువ 24:14, 15లో ఉన్నట్లుగా యెహోషువ ఎందుకు చెప్పగలిగాడు, దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? [w08 5/15 17, 18 పేజీలు, 4-6 పేరాలు]
3. బయలు ఆరాధకుల వల్ల, వారి ఆచారాల వల్ల ఇశ్రాయేలీయులు ఎలా తప్పుదోవ పట్టారు? (న్యాయా. 2:3) [w08 2/15 27వ పేజీ, 2, 3 పేరాలు]
4. ఏహూదు ధైర్యంగా కత్తిని ఉపయోగించడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 3:16, 21) [w97 3/15 31వ పేజీ, 4వ పేరా]
5. యెహోవా, గిద్యోనును అతని 300 మంది సైనికులను రక్షించిన తీరు గురించి చదివినప్పుడు మనకు కూడా ఏమి చేయాలనిపిస్తుంది? (న్యాయా. 7:19-22) [w05 7/15 16వ పేజీ, 8వ పేరా]
6. యెహోవా ఆత్మ ఎందుకు, “ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను”? (న్యాయా. 10:16) [cl 254, 255 పేజీలు, 10-11 పేరాలు]
7. యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకున్నప్పుడు మానవబలి అర్పించాలని తలంచాడా? (న్యాయా. 11:30, 31) [w05 1/15 26వ పేజీ, 2వ పేరా]
8. సమ్సోను శక్తి నిజంగా ఆయన జుట్టులో ఉందా? (న్యాయా. 16:18-20) [w05 3/15 28వ పేజీ, 5, 6 పేరాలు]
9. న్యాయాధిపతులు 16:3లో వర్ణించబడిన, సమ్సోను చేసిన ఆశ్చర్యకరమైన పనిని అర్థం చేసుకోవడం మనకు ఎలా సహాయం చేస్తుంది? [w04 10/15 15, 16 పేజీలు, 7-8 పేరాలు]
10. ‘ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించడం’ అల్లకల్లోలాన్ని సృష్టించిందా? (న్యాయా. 17:6) [w05 1/15 27వ పేజీ, 8వ పేరా]