ఫిబ్రవరి 15తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఫిబ్రవరి 15తో మొదలయ్యే వారం
పాట 16 (143)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 15-18
నం. 1: న్యాయాధిపతులు 16:1-12
నం. 2: ప్రధాన విషయాలను ఎంపిక చేసుకోవడం (fy 122వ పేజీ, 14, 15 పేరాలు)
నం. 3: “అబద్ధమునకు జనకుడు” అని యేసు అపవాదిని ఎందుకు పిలిచాడు? (యోహా. 8:44)
❑ సేవా కూటం:
పాట 6 (45)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: కావలికోట ఇవ్వడానికి సిద్ధపడండి. ఈ నెలలో ఇచ్చే పత్రిక గురించి కొన్ని విషయాలు చెప్పి, స్థానికంగా ఉన్నవారికి ఏ ఆర్టికల్స్ ఎక్కువ ఆసక్తికరంగా ఉండవచ్చో చెప్పండి. ఒక ప్రచారకుడు పత్రికను ఇవ్వడానికి సమయం తీసుకుని ఎలా సిద్ధపడాలో చూపించే ప్రదర్శన చేయించండి. ఈ ప్రదర్శనలో ఆయన తనలో తాను మాట్లాడుకోవాలి. తమ ప్రాంతంలోని వారికి ఏ ఆర్టికల్స్ నచ్చుతాయో నిర్ణయించుకుని, ఒక ప్రశ్న ఆలోచించుకుని, ఏ లేఖనాలు ఉపయోగిస్తే బావుంటుందో ఎంచుకుంటాడు. ఇంటివారికి మనం చెప్పేది వినాలనే ఆసక్తి ఉందో లేదో ఎలా గ్రహించాలి, వారి మతాభిమానం దెబ్బతినకుండా ఎలా మాట్లాడాలి అనే వాటిగురించి ఆలోచిస్తాడు. తను ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో రిహార్సల్ చేసుకుంటాడు.
15 నిమి: తర్కించే విధానం వల్ల ప్రజలు వినడానికి ఇష్టపడతారు. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 251వ పేజీ నుండి 253వ పేజీ, 2వ పేరా వరకు ఉన్న సమాచారం నుండి ప్రసంగం.
పాట 22 (130)