కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/10 పేజీ 2
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2000
  • కూటములనుండి ఎక్కువగా ప్రయోజనము పొందునట్లు పిల్లలకు సహాయము చేయుము
    మన రాజ్య పరిచర్య—1990
  • యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకు ఎలా సహాయం చేస్తాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • పవిత్రమైన దేవోక్తులను శ్రద్ధగా ఆలకించేవారై ఉండండి
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 1/10 పేజీ 2

ప్రశ్నాభాగం

◼ సంఘ కూటాల్లో నేర్చుకోవడానికి అనువైన వాతావరణం ఉండేలా చూడడానికి సంఘంలో ప్రతీ ఒక్కరూ తమ వంతుగా ఏమి చేయవచ్చు? (ద్వితీ. 31:12)

యెహోవా మీద, ఆయన ఏర్పాటు చేసిన కూటాల మీద ఉన్న గౌరవంతో అందరూ సమయానికి ముందుగా వచ్చి, ఆయన ఇస్తున్న ఉపదేశాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించబడుతున్నారు. ముందుగా వచ్చిన వారు ముందు వరుస కుర్చీల్లో కూర్చోవడం మంచిది. దానివల్ల చిన్నపిల్లలున్న వారికి, అప్పుడప్పుడు ఆలస్యంగా వచ్చేవారికి వెనుక ఉన్న కుర్చీల్లో కూర్చోనే వీలుంటుంది. కూటం మొదలవడానికి ముందు సెల్‌ఫోన్లు, పేజర్లు వంటి వాటిని ప్రేక్షకులకు ఆటంకం కలిగించని విధంగా సెట్‌ చేసుకోవాలి. హాజరైన వాళ్లంతా కూటం జరుగుతున్నంతసేపు భయభక్తులతో నడుచుకుంటే, ఇతరులకు పెద్దగా ఆటంకం కలిగించకుండా ఉండడానికి మనవంతు ప్రయత్నం మనం చేసినట్లవుతుంది.—ప్రసం. 5:1; ఫిలి. 2:4.

కొత్తవారు కూటాలకు రావడం మొదలుపెడితే, సంఘంలో వారితో పరిచయమున్నవారు వారిని తమ పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆ వచ్చేవాళ్లకు చిన్నపిల్లలుంటే ఆ పిల్లలు కుదురుగా కూర్చుని, చక్కగా వినడం నేర్చుకోగలుగుతారు. ఆ కుటుంబానికి కూటాలకు రావడం బహుశా కొత్త కావచ్చు. అలాగైతే, వాళ్లు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా తమ పిల్లలను చూసుకునేందుకు, అవసరమైతే తమ పిల్లలను కొంతసేపు బయటకు తీసుకువెళ్లేందుకు వీలుగా వెనక సీట్లలో కూర్చునే అవకాశముంటే సంతోషిస్తారు. (సామె. 22:6, 15) చిన్నపిల్లలున్న వాళ్లు వేరే గదిలో కూర్చుంటే పిల్లలు ఇంకా ఎక్కువ అల్లరిచేసే అవకాశముంటుంది కాబట్టి అలా కూర్చోకపోవడం మంచిది. తల్లిదండ్రులు అవసరమైనప్పుడు తమ పిల్లలను హాలు బయటకు తీసుకువెళ్ళి వారికి కావాల్సినవి ఇచ్చి, వారి అవసరాలు తీర్చి తిరిగి హాలులోకి తీసుకొచ్చి వారిని కూర్చోబెట్టుకోవడం మంచిది.

రాజ్యమందిరంలోని వాతావరణం ఆరాధనకు తగ్గట్టు ఉండేలా చూడడానికి అటెండెంట్లు కృషి చేస్తారు. వీళ్లు, కుటుంబంతో కలిసి వచ్చేవారికి, అప్పుడప్పుడు ఆలస్యంగా వచ్చేవారికి కూర్చోడానికి చోటు చూపిస్తారు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా అందరూ సౌకర్యవంతంగా కూర్చొనేలా చూడడానికి అటెండెంట్లు తెలివిగా, చాకచక్యంగా వ్యవహరిస్తారు. అనుకోని అవాంతరాలు ఏవైనా ఏర్పడితే, వాటిని సరిచేయడానికి వాళ్లు వెంటనే చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలెవరైనా ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే అటెండెంట్లు వారికి సహాయం చేయడానికి చొరవ తీసుకోవచ్చు.

యెహోవా గురించి, నీతి, శాంతి విలసిల్లే నూతన లోకం తీసుకురావాలనే ఆయన ఉద్దేశం గురించి నేర్చుకోవడానికి మనం కూటాలకు వస్తాం. అలా నేర్చుకోవడానికి అనువైన వాతావరణం ఉండేలా చూడడానికి కూటాలకు వచ్చే ప్రతీ ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయవచ్చు.—హెబ్రీ. 10:24, 25.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి