డిసెంబరు 28తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
డిసెంబరు 28తో ప్రారంభమయ్యే వారం
పాట 17 (187)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 12–15
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
పాట 23 (200)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మాకు చెప్పొద్దని అంటే ఏంచేయాలి? మీ ప్రాంతంలో ప్రజలు మీరు చెప్పేది వినకపోవడానికి సాధారణంగా ఎలాంటి కారణాలు ఇస్తారో ప్రేక్షకులతో చర్చించండి. ఆ కారణాల్లో ఒక దాన్ని ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో పునర్దర్శనాలకు వెళ్లినప్పుడు బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి ప్రయత్నించడం వల్ల ఏమి జరిగింది? మీ ప్రాంతంలో ప్రజలు దేని గురించి మాట్లాడితే ఎక్కువగా ఇష్టపడుతున్నారో చెప్పమని లేదా ప్రదర్శించమని ఒక పయినీరును లేదా ప్రచారకుని అడగండి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటివారికి నిజంగా ఆసక్తి ఉందని తెలుసుకున్న తర్వాతే బైబిలు అధ్యయనాన్ని గురించి చెప్పడం మంచిది. అంటే రెండు, మూడు పునర్దర్శనాలు చేసిన తర్వాత చెప్తే బావుంటుంది.
10 నిమి: జనవరిలో ఇవ్వాల్సిన ప్రచురణ. ఆ ప్రచురణ గురించి క్లుప్తంగా చెప్పండి. అవతలివారు నిజంగా ఆసక్తి చూపిస్తేనే బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని చూపించండి. దాన్ని ఉపయోగించి అనియత సాక్ష్యమిస్తూ బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక ప్రచారకునితో చర్చించండి. ఈ నెలలో ఒక బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నించమని అందరిని ప్రోత్సహించండి. బైబిలు బోధిస్తోంది పుస్తకంలో 16వ అధ్యాయంలో ఉన్న, విగ్రహాలను ఆరాధించడం వంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంటివారు అభ్యంతరపడవచ్చు కాబట్టి పరిస్థితులు గమనించుకుని మాట్లాడాలని కూడా ప్రోత్సహించండి.
పాట 8 (53)