దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ క్రింది ప్రశ్నలను 2009 అక్టోబరు 26తో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చర్చిస్తారు.
1. బాలాకు మనుష్యులతో వెళ్లమని బిలాముకు చెప్పింది యెహోవాయే కదా. మరి బిలాము వాళ్లతో వెళ్లినప్పుడు యెహోవాకు ఆయన మీద ఎందుకు కోపం వచ్చింది? (సంఖ్యా. 22:20-22) [w04-TU 8/1 27వ పేజీ, 2వ పేరా]
2. ఫీనెహాసు మాదిరి, యెహోవాకు సమర్పించుకోవడమంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి మనకెలా సహాయం చేస్తుంది? (సంఖ్యా. 25:11) [w95-TU 3/1 16వ పేజీ, 13వ పేరా]
3. యెహోషువ మోషే తర్వాతి స్థానంలో ఎందుకు నియమించబడ్డాడు? (సంఖ్యా. 27:15-19) [w02-TU 12/1 12వ పేజీ, 1, 5 పేరాలు]
4. సంఖ్యాకాండము 31:27వ వచనం నేడు క్రైస్తవులను ఎలా ప్రోత్సహిస్తుంది? [w05-TU 3/15 24వ పేజీ]
5. ఆశ్రయపురముల ఏర్పాటు ఇశ్రాయేలు ప్రజలకు ఏయే విధాలుగా ప్రయోజనం చేకూర్చింది? (సంఖ్యా. 35:11, 12) [w95-TU 11/15 14వ పేజీ, 17వ పేరా]
6. వివేకం ఎందుకు ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవ లక్షణం, దానివల్ల ప్రయోజనం ఏమిటి? (ద్వితీ. 1:13) [w03-TU 1/15 30వ పేజీ; w00-TU 10/1 32వ పేజీ, 1-3 పేరాలు]
7. మోషే ధర్మశాస్త్రం దేవుని నీతిని ఏయే విధాలుగా వ్యక్తం చేసింది? (ద్వితీ. 4:8) [w02-TU 6/1 14వ పేజీ, 8వ పేరా–15వ పేజీ 9, 10 పేరాలు]
8. ద్వితీయోపదేశకాండము 6:16-19 వచనాల ప్రకారం, యెహోవాను ఏవిధంగా శోధించడం సరైనదో, ఏవిధంగా శోధించడం సరైనది కాదో తెలియజేయండి. [w04-TU 9/15 27వ పేజీ, 1వ పేరా]
9. యెహోవా మాటలవల్ల ఇశ్రాయేలీయుల అవసరాలు ఎలా తీరాయి, నేడు అవి మనల్ని ఏవిధంగా పోషిస్తాయి? (ద్వితీ. 8:3) [w99-TU 8/15 25, 26 పేజీలు]
10. మన స్వంత రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య ప్రక్రియల విషయంలో ద్వితీయోపదేశకాండము 12:16, 24 వచనాలు మన దృక్కోణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? [w00-TU 10/15 30వ పేజీ, 7వ పేరా]