ప్రశ్నా భాగం
◼ ప్రకటించవద్దని చెప్తే ఏం చేయాలి?
కొన్నిసార్లు పోలీసులు, పరిచర్య చేస్తున్న ప్రచారకుల దగ్గరికి వచ్చి అలా ప్రకటించడం చట్టరీత్యా నేరమని, వెంటనే ఆపాలని చెప్పారు. అలా చెప్పినప్పుడు వారితో వాదించకుండా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలి. (మత్త. 5:41; ఫిలి. 4:5) అక్కడ రాజ్యాంగ హక్కుల గురించి వారితో మాట్లాడి ఆ సమస్యను సొంతగా పరిష్కరించడానికి ప్రయత్నించకండి. సాధ్యమైతే ఆ పోలీసు పేరేమిటో, ఆయన ఏ స్టేషన్లో పని చేస్తాడో యుక్తిగా తెలుసుకోండి. ఆ తర్వాత, జరిగిన దాన్ని వెంటనే పెద్దలకు తెలియజేయండి, వాళ్లు బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదిస్తారు. ఏదైనా అపార్టుమెంట్ బిల్డింగ్లో నుండి వెళ్లిపోమని అక్కడ పనిచేస్తున్న వ్యక్తి చెప్తే అక్కడ నుండి వెంటనే బయటికి వచ్చేసి, పెద్దలకు విషయాన్ని చెప్పాలి. అధికారంలో ఉన్నవారితో అనవసరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలంటే వారితో సౌమ్యంగా, అణకువగా వ్యవహరించడం మంచిది.—సామె. 15:1; రోమా. 12:18.