అక్టోబరు 19తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
అక్టోబరు 19తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (222)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 7–10
నం. 1: ద్వితీయోపదేశకాండము 9:1-14
నం. 2: మీ పిల్లలకు ఎవరు బోధిస్తారు? (fy 90-92 పేజీలు, 1-7 పేరాలు)
నం. 3: ఎంతమందికి పరలోక నిరీక్షణ ఉందని బైబిలు చెబుతుంది?
❑ సేవా కూటం:
పాట 6 (45)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: పరిశోధన వల్ల అవగాహన పెరుగుతుంది. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 33వ పేజీ నుండి 34వ పేజీలోని ఉపశీర్షిక వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. బైబిలు విద్యార్థులు తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి, పరిచర్య కోసం సిద్ధపడడానికి ఎలా పరిశోధన చేయాలో ప్రచారకులు వారికి నేర్పించాలి. దానికోసం ప్రచారకులు ఏమి చేయవచ్చో ఆ సమాచారం ఆధారంగా చర్చించండి. పరిశోధన చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవడానికి ఒక ప్రచారకుడు బైబిలు విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
15 నిమి: “ఫోన్లో సాక్ష్యమివ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది.” ప్రశ్నాజవాబుల చర్చ. ఈ నెలలో అందించాల్సిన ప్రచురణను ఉపయోగిస్తూ ఇద్దరు ప్రచారకుల చేత రెండు ప్రదర్శనలు చేయించండి.
పాట 9 (37)