మీరెలా సమాధానమిస్తారు?
1. ప్రజలు మనల్ని ప్రశ్నలు అడిగినప్పుడు, యేసు సమాధానమిచ్చిన పద్ధతిని మనం ఎందుకు అనుసరించాలి?
1 తనని ప్రశ్నలు అడిగినవారికి యేసు సమాధానమిచ్చిన తీరుకు ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. పరిచర్యలో ప్రజలు మనల్ని వివిధ రకాల ప్రశ్నలు అడిగినప్పుడు మనం యేసు సమాధానమిచ్చిన పద్ధతిని అనుసరించడం మంచిది.—1 పేతు. 2:21.
2. ఒక ప్రశ్నకు సమర్థవంతంగా సమాధానమివ్వాలంటే మనం ఏంచేయాలి?
2 ముందు వినండి: ఒక వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగితే, ఆ వ్యక్తి ఆ ప్రశ్న ఎందుకు అడిగివుంటాడో అని యేసు ఆలోచించేవాడు. మనం కూడా కొన్నిసార్లు, ప్రశ్న అడిగిన వ్యక్తి అసలు ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఎదురు ప్రశ్నలు అడగాల్సివుంటుంది. “మీరు యేసును నమ్ముతారా?” అని అడిగిన వ్యక్తి, నిజానికి మీరు క్రిస్మస్ ఎందుకు చేసుకోరో తెలుసుకోవాలని అనుకుంటుండవచ్చు.—లూకా 10:25-37.
3. సరైన లేఖన సమాధానాలు తెలుసుకోవడానికి మనకు ఏ చిన్న పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి?
3 దేవుని వాక్యం నుండి సమాధానమివ్వండి: ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే దానికి బైబిలు నుండి సమాధానం చూపించడం మంచిది. (2 తిమో. 3:16, 17; హెబ్రీ. 4:12) సరైన సమాధానమివ్వడానికి చర్చనీయ బైబిలు అంశాలు, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకాలు సహాయం చేస్తాయి. ప్రశ్న అడిగిన వ్యక్తి బైబిలు దేవుని వాక్యమని అంగీకరించకపోయినా, లేఖనాలు బోధిస్తున్నదాన్ని మీరు యుక్తిగా వారికి చెప్పవచ్చు. బైబిల్లోవున్న ఖచ్చితమైన జ్ఞానం గురించి గంభీరంగా ఆలోచించమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి. యేసులా మీరు సమాధానమిస్తే, మీ సమాధానాలు ‘చిత్రమైన వెండి పళ్లెంలో ఉంచబడిన బంగారు పండ్లలా’ ఉంటాయి, అంటే మర్యాదపూర్వకంగా, చక్కగా, సహాయకరంగా ఉంటాయి.—సామె. 25:11.
4. ఎలాంటి సందర్భాల్లో మనం ప్రతీ ప్రశ్నకు సమాధానమివ్వకపోవడం మంచిది?
4 ప్రతీ ప్రశ్నకు సమాధానమివ్వాలా? ఏదైనా ఒక ప్రశ్నకు మీకు సమాధానం తెలియకపోతే “నాకు తెలీదు, కానీ మీరడిగిన ప్రశ్న గురించి పరిశోధన చేసి సమాధానం తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను” అని చెప్పడానికి సిగ్గుపడకండి. అలాంటి వినయాన్ని, మీరు చూపించే వ్యక్తిగత ఆసక్తిని చూసి ఆ వ్యక్తి మళ్ళీ రమ్మని మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ప్రశ్న అడిగిన వ్యక్తి వాదన మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మీరు గ్రహిస్తే, యేసులా క్లుప్తంగా సమాధానమివ్వండి. (లూకా 20:1-8) అలాగే, సత్యంపట్ల నిజమైన ఆసక్తిలేని ఎవరైనా మిమ్మల్ని వాదనలోకి దింపే ప్రయత్నం చేస్తే, మర్యాదపూర్వకంగా సంభాషణ అంతటితో ఆపేసి నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళను వెదకడానికి మీ సమయాన్ని వెచ్చించండి.—మత్త. 7:6.
5. ప్రశ్నలకు సమాధానమిచ్చే విషయంలో యేసు మనకు ఎలాంటి మాదిరినుంచాడు?
5 ‘సత్యం గురించి సాక్ష్యమివ్వడం’ అనే తన నియామకాన్ని నిర్వర్తించడంలో భాగంగా, ప్రజలు యథార్థంగా అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి యెహోవాపై ఆధారపడడం ఎంతో ప్రాముఖ్యమని యేసుకు తెలుసు. (యోహా. 18:37) ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల వారికి’ యేసులా సమాధానమిచ్చే గొప్ప ఆధిక్యత మనకుంది.—అపొ. 13:48.