ప్రకటనలు
▪ అందించాల్సిన ప్రచురణలు మేలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకు హాజరవుతూ సంఘంతో మాత్రం చురుగ్గా సహవసించనివారితోసహా, ఆసక్తిగలవారిని తిరిగి కలుసుకుంటున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే కొత్త పుస్తకాన్ని ఇవ్వండి. ఆ పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. జూన్‌లో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే 1992కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం దాన్నెలా సాధించవచ్చు, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, అప్రమత్తంగా ఉండండి!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.
▪ మళ్ళీ లభ్యమౌతున్న ప్రచురణ:
భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! —టిబెటియన్