సేవా కూటాల కార్యక్రమం
నవంబరు 10తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: ప్రేమపూర్వకమైన, ఉదారమైన స్ఫూర్తిని వృద్ధిచేసుకుంటూ ఉండండి. కావలికోట నవంబరు 15, 2008, 6-7 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “ఇతరులతో పంచుకోవడానికి మన దగ్గర విలువైన సంపదలున్నాయి.”a 2వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, ప్రత్యేకంగా వారిని యెహోవా సంస్థవైపుకు ఆకర్షించిన బైబిలు సత్యాల గురించి లేదా వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరింత స్పష్టంగా అర్థం చేసుకున్న విషయాల గురించి ప్రేక్షకులను చెప్పమనండి.
పాట 22 (130)
నవంబరు 17తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు.
15 నిమి: ప్రశ్నాభాగం.b
20 నిమి: “మీరు బోధించగలరు!”c బైబిలు అధ్యయనం చేయలేనని ఒకప్పుడు భావించిన ఒక ప్రచారకుణ్ణి లేదా పయినీరును ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు యెహోవా సహాయంపై ఎలా ఆధారపడ్డారు? వాళ్ళు అర్హులయ్యేందుకు సంస్థ ఏ నిర్దిష్ట మార్గాల్లో సహాయం చేసింది? ఇతరులతో పాటు పునర్దర్శనాలకు, బైబిలు అధ్యయనాలకు వెళ్ళడం ద్వారా వాళ్ళు ఎలాంటి ప్రయోజనాలు పొందారు?
పాట 16 (143)
నవంబరు 24తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. సంఘ ఖర్చుల వివరాలను, సంఘం పంపించిన విరాళాలు అందినట్లు తెలియజేస్తూ సంస్థ పంపిన ఉత్తరాన్ని చదవండి. మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రాన్ని తమ క్షేత్రంలో సంఘం ఎంత వరకు అందించిందనే దాని గురించి సేవా పైవిచారణకర్త చెప్పింది కూడా చేర్చండి. డిసెంబరులో అందించే సాహిత్యాల గురించి చెప్పి, ఒకటి రెండు అందింపులను ప్రదర్శింపజేయండి.
20 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: అక్టోబరు-డిసెంబరు కావలికోట అందించండి. చాలామంది ప్రచారకులు ఈ పత్రికను ఇప్పటికే అందిస్తున్నారు కాబట్టి గృహస్థులు పత్రికను ఆసక్తితో తీసుకునేలా ఎలా అందించారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. స్థానిక క్షేత్రానికి ఏ ఆర్టికల్‌లు ఆకర్షణీయంగా ఉండవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఆ ఆర్టికల్‌లను పరిచయం చేయడానికి ఏ ప్రశ్నలను, ఏ లేఖనాలను ఉపయోగించవచ్చు? మన రాజ్య పరిచర్యలోని ఒక నమూనా అందింపును ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శింపజేయండి. స్థానిక క్షేత్రానికి తగినవిధంగా ఉండే ఆర్టికల్ ఆధారంగా సిద్ధం చేసుకున్న సంక్షిప్త అందింపును పెద్దలలో ఒకరితో ప్రదర్శింపజేయండి.
పాట 8 (53)
డిసెంబరు 1తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
10 నిమి: స్థానిక ప్రకటనలు. నవంబరు క్షేత్ర సేవా రిపోర్టులు ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి.
15 నిమి: ఆసక్తిరేకెత్తించే ఉపోద్ఘాతాలు సిద్ధం చేసుకోవడం. మన రాజ్య పరిచర్య, 2/92, 8వ పేజీ, 1/02 3వ పేజీ ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 62-64, 125, 159, 166-167, 186, 202, 217-219, 236-237 పేజీలను చూడండి. డిసెంబరులో ఇవ్వాల్సిన పుస్తకాన్ని ఎలా అందించాలో రెండు ప్రదర్శనల్లో చూపించండి.
20 నిమి: “వ్యతిరేకతను తాళుకోవడానికి కొత్తవారిని సిద్ధంచేయండి.”d
పాట 17 (187)
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.