కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/08 పేజీ 1
  • సంఘకూటపు కొత్త కార్యక్రమం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంఘకూటపు కొత్త కార్యక్రమం
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1990
  • క్షేత్రసేవా కూటాలు, వాటికున్న ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తాయి
    మన రాజ్య పరిచర్య—2015
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—2007
  • మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 10/08 పేజీ 1

సంఘకూటపు కొత్త కార్యక్రమం

1 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులందరూ 2008 ఏప్రిల్‌ 21 నుండి 27 వరకున్న వారంలో, ఒక సంతోషకరమైన ప్రకటన విన్నారు. అది, “జనవరి 1, 2009 మొదలుకొని సంఘ పుస్తక అధ్యయనం కూడా దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవాకూటం జరిగే రోజునే జరుగుతుంది. సంఘపుస్తక అధ్యయనం ఇకపై సంఘ బైబిలు అధ్యయనం అని పిలవబడుతుంది.”

2 వారం వారం జరిగే ఈ కూటపు కార్యక్రమం: పాటలు, ప్రార్థనలతో కలిపి ఈ కూటం కోసం కేటాయించిన మొత్తం సమయం 1 గంట 45 నిమిషాలు. కూటం పాట, ప్రార్థనతో (5 నిమి.) ప్రారంభమైన తర్వాత సంఘ బైబిలు అధ్యయనం (25 నిమి.) ఉంటుంది. అది పూర్తయిన వెంటనే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల (30 నిమి.) జరుగుతుంది. ఆ తర్వాత పాటతో (5 నిమి.) సేవాకూటం (35 నిమి.) ప్రారంభమవుతుంది. పాట, ప్రార్థనలతో (5 నిమి.) ఆ కూటం ముగుస్తుంది. ఈ కూటాలకు సిద్ధపడడానికి వీలుగా సంఘ బైబిలు అధ్యయనం, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటాలకు సంబంధించిన కార్యక్రమం నెలనెలా మన రాజ్య పరిచర్యలో ప్రచురించబడుతుంది.

3 సంఘ బైబిలు అధ్యయనం: ఈ కూటం, కావలికోట అధ్యయనం జరిగే పద్ధతిలోనే జరుగుతుంది. అధ్యయనం మొదలుపెట్టేముందు గతవారం నేర్చుకున్న విషయాన్ని పునఃసమీక్షించవలసిన అవసరం లేదు. దానికి బదులు కూటాన్ని చిన్న ఉపోద్ఘాతంతో మాత్రమే ప్రారంభించాలి. అలా చేస్తే క్లుప్తంగా వ్యాఖ్యానించడానికి హాజరైనవారందరికీ అవకాశముంటుంది. ఈ కూటాన్ని నిర్వహించడానికి వారానికి ఒక పెద్దను నియమించడం సంఘ పైవిచారణకర్త పర్యవేక్షణలో జరుగుతుంది.

4 సేవా కూటం: సేవా కూటం ఇప్పుడు జరుగుతున్నట్లుగానే ఉంటుంది కానీ దానిలోని భాగాలకు కేటాయించిన సమయం తగ్గుతుంది. సాధారణంగా ప్రకటనలు ఐదు నిమిషాలపాటు ఉంటాయి. ఈ సమయం అవసరమైన ప్రకటనలకు, బ్రాంచి నుండి వచ్చే ప్రత్యేక ఉత్తరాలు చదవడానికి సరిపోతుంది. క్షేత్రసేవా ఏర్పాట్లు, రాజ్యమందిరం శుభ్రంచేయడం, సంఘ ఖర్చులు వంటి ప్రకటనలను, బ్రాంచి కార్యాలయం నుండి వచ్చే సాధారణ ఉత్తరాలను స్టేజీ పైనుండి చదవాల్సిన అవసరం లేదు. కానీ వాటిని సహోదరులు చదువుకోవడానికి వీలుగా సమాచార బోర్డుపై ఉంచుతారు. కార్యక్రమంలోని భాగాలను నిర్వహించడానికి నియమించబడినవారు చక్కగా సిద్ధపడి, వారికి కేటాయించిన సమయంలోనే ముగించాలి, ఇచ్చిన సూచనలను పాటించాలి.

5 ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం: ప్రాంతీయ పైవిచారణకర్త వారపు కార్యక్రమంలో మార్పులేమీ ఉండవు. మంగళవారం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవాకూటం తర్వాత పాట ఉంటుంది. ఆ తర్వాత ప్రాంతీయ పైవిచారణకర్త 30 నిమిషాలపాటు ప్రసంగిస్తారు. ఇప్పటిలాగే, ఆయన సందర్శించే వారంలో మరో రోజున సంఘ బైబిలు అధ్యయనం తర్వాత పాట, ప్రాంతీయ పైవిచారణకర్త సేవా ప్రసంగం ఉంటాయి. ఈ కూటం పాట ప్రార్థనలతో ముగుస్తుంది.

6 క్షేత్రసేవా కూటాలు: క్షేత్రసేవా గ్రూపుల విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి, ఆ గ్రూపులోని సభ్యులకు కాపరులుగా పని చేయడానికి పెద్దల సభ క్షేత్రసేవా గ్రూపు పైవిచారణకర్తలను నియమిస్తుంది. ఈ స్థానంలో పరిచర్య సేవకుణ్ణి నియమించవలసివస్తే ఆయన “క్షేత్రసేవా గ్రూపు సేవకుడిగా” గుర్తించబడతాడు.

7 ఈ ఏర్పాటును బట్టి, యెహోవాతో మంచి సంబంధానికి కావలసిన ఉపదేశం, ప్రోత్సాహం ఇచ్చే సమాచారాన్ని పరిశీలించే గొప్ప అవకాశం మనకుంటుంది. ఇది మనం పరిచర్యలో మరింత ఫలవంతంగా ఉండడానికి శిక్షణపొంది, సమర్థులైన ప్రచారకులుగా, బోధకులుగా తయారవడానికి సహాయం చేస్తుంది.—ఎఫె. 4:13, 14; 2 తిమో. 3:16, 17.

8 ఈ కూటాలకు ముందుగానే సిద్ధపడితే, ప్రతీ కూటంలో ప్రత్యేకంగా చెప్పే ముఖ్యాంశాలపై పూర్తిగా శ్రద్ధనిలపవచ్చు. వ్యాఖ్యానాలిస్తూ ఒకరినొకరం ప్రోత్సహించుకొనే మంచి అవకాశం మనందరికీ ఉంటుంది. (రోమా. 1:11, 12; హెబ్రీ. 10:24, 25) ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడం’ ద్వారా ‘మన అభివృద్ధి అందరికి తేటగా కనబడేలా చేయడమే’ మన లక్ష్యంగా ఉండాలి.—1 తిమో. 4:15; 2 తిమో. 2:15.

9 సంఘ కూటాల విషయంలో వచ్చిన ఈ మార్పును బట్టి మనందరం సంతోషిస్తున్నాం. మన గొప్ప కాపరి, త్వరలో రాబోతున్న మహా ‘శ్రమలకు’ మనల్ని సిద్ధంచేస్తుండగా ఆయనకు సన్నిహితంగా ఉంటూ “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ఉపదేశాన్ని మనందరం పాటిద్దాం.—మత్త. 24:21, 45; హెబ్రీ. 13:20, 21; ప్రక. 7:14.

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. కూటాల్లో 2009 జనవరి నుండి ఏ మార్పులు జరుగుతాయి?

3. సంఘ బైబిలు అధ్యయనం ఎలా జరుగుతుంది?

4. సేవాకూటంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి?

5. ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శించే వారంలో, సంఘ కూటపు కార్యక్రమం ఎలా ఉంటుంది?

6. క్షేత్రసేవా గ్రూపు పైవిచారణకర్త ఏమి చేస్తాడు?

7. సంఘ కూటపు కొత్త కార్యక్రమం ద్వారా మనకెలాంటి అవకాశాలు ఉంటాయి?

8. మనలో ప్రతీ ఒక్కరం ముందుగా సిద్ధపడడం మనకూ ఇతరులకూ ఎలా ఉపయోగకరంగా ఉంటుంది?

9. మనమేమని నిర్ణయించుకోవాలి, ఎందుకలా నిర్ణయించుకోవాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి