కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/08 పేజీ 2
  • సేవా కూటాల కార్యక్రమం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల కార్యక్రమం
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఉపశీర్షికలు
  • అక్టోబరు 13తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 20తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 27తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2008
km 10/08 పేజీ 2

సేవా కూటాల కార్యక్రమం

అక్టోబరు 13తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

35 నిమి: “సంఘకూటపు కొత్త కార్యక్రమం.”a సమయముంటే ఉదాహరించిన లేఖనాలను చదివి, వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.

పాట 9 (37)

అక్టోబరు 20తో ప్రారంభమయ్యే వారం

పాట 12 (113)

5 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు.

20 నిమి: పరిచర్యలో మీ సంతోషాన్ని కాపాడుకోండి. కావలికోట జూలై 1, 2005, 24-25 పేజీలు, 11-17 పేరాల ఆధారంగా ప్రోత్సాహకరమైన ప్రసంగం. ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా యెహోవా సేవచేస్తున్న ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేయండి. ప్రజలు సరిగా స్పందించకపోయినా వాళ్ళు పరిచర్యను సంతోషంగా ఎలా చేయగలుగుతున్నారు?

20 నిమి: అక్టోబరు-డిసెంబరు కావలికోట పత్రిక అందించండి. పత్రికలో ఉన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పిన తరువాత, స్థానిక క్షేత్రంలో ఎక్కువమంది ఏ ఆర్టికల్‌లపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారనుకుంటున్నారో ప్రేక్షకులను అడగండి. ప్రజలు ఎందుకు ఆ ఆర్టికల్‌లపై ఆసక్తి చూపిస్తారనుకుంటున్నారో వివరించమనండి. పత్రికను అందించడానికి ముందు సంభాషణ ప్రారంభించడానికి ఏ ప్రశ్న అడగాలని, ఆర్టికల్‌లోని ఏ లేఖనాన్ని చూపించాలని సిద్ధపడ్డారో ప్రేక్షకులను చెప్పమనండి. ముగింపులో ప్రసంగీకుడు, పత్రికను ఎలా అందించాలో చూపించే 8వ పేజీలోని నమూనా అందింపును గానీ, మీ క్షేత్రంలోని ప్రజలకు ఆసక్తికరంగా తయారుచేసిన వేరే అందింపును గానీ ప్రదర్శించాలి.

పాట 18 (162)

అక్టోబరు 27తో ప్రారంభమయ్యే వారం

పాట 3 (32)

5 నిమి: స్థానిక ప్రకటనలు. సంఘ ఖర్చుల వివరాలను, సంఘం పంపించిన విరాళాలు అందినట్లు తెలియజేస్తూ సంస్థ పంపిన ఉత్తరాన్ని చదవండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

30 నిమి: “వ్యక్తిగత, కుటుంబ బైబిలు అధ్యయనాలు ఎంతో ప్రాముఖ్యం!”b సమయముంటే ఉదాహరించిన లేఖనాలను చదివి, వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.

పాట 17 (187)

నవంబరు 3తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్టోబరు క్షేత్ర సేవా రిపోర్టులు ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. నవంబరు 10తో ప్రారంభమయ్యే కరపత్రాన్ని అందించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం కోసం స్థానికంగా చేసిన ఏర్పాట్ల గురించి వివరించి, ఇంకా ఎవరైనా కరపత్రాలు తీసుకోకపోతే తీసుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, 2009. పాఠశాల పైవిచారణకర్త, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమంలో “సూచనలు” క్రింద ఇచ్చిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కొత్త ఏర్పాటు గురించి ప్రేక్షకులతో చర్చిస్తారు. పాఠశాలలో వచ్చిన మార్పులను ప్రత్యేకంగా చర్చించండి. ప్రతీ ఒక్కరూ పాఠశాలలో తమ భాగాలను నిర్వహించడానికి, బైబిలు ముఖ్యాంశాల్లో వ్యాఖ్యానించేలా సిద్ధపడడానికి, భాగాలు నిర్వహించినవారికి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకం ఆధారంగా పాఠశాల పైవిచారణకర్త ప్రతీవారం ఇచ్చే సూచనలను అందరూ పాటించడానికి కృషిచేయాలని ప్రోత్సహించండి.

15 నిమి: మీ ‘బోధనాకళను’ మెరుగుపర్చుకోండి. సేవా పైవిచారణకర్త లేదా అర్హతగల మరో పెద్ద, కావలికోట జనవరి 15, 2008, 9-12 పేజీలు, 5-18 పేరాల్లో సమర్థవంతంగా బోధించడానికి సంబంధించివున్న ఐదు ముఖ్యాంశాల గురించి చెప్పి, వాటిపై క్లుప్తంగా వ్యాఖ్యానిస్తారు. ఈ సమాచారం, తమ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సహాయపడిందని భావిస్తున్న ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి.

పాట 21 (191)

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి