సేవా కూటాల పట్టిక
జూన్ 9తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేదా మీ క్షేత్రానికి అనువైన వేరే అందింపులను ఉపయోగించి, ఏప్రిల్ - జూన్ కావలికోటను ఎలా ఇవ్వాలో ప్రదర్శించండి.
20 నిమి: బైబిలు అధ్యయనం నిర్వహించడానికి ఎలా సిద్ధపడాలి? మన రాజ్య పరిచర్య ఆగస్టు 2004, 1వ పేజీ ఆధారంగా ప్రసంగం. చర్చ ముగింపులో, ఒక ప్రచారకుడు బైబిలు అధ్యయనం నిర్వహించేందుకు హడావుడిగా సిద్ధపడడానికి ప్రయత్నిస్తున్నట్లు మొదటి ప్రదర్శనలో చూపించండి. రెండవ ప్రదర్శనలో మరో ప్రచారకుడు మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకుంటూ సిద్ధపడుతున్నట్లు చూపించండి.
15 నిమి: “మానకుండా ప్రకటించండి.”a సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 8 (53)
జూన్ 16తో ప్రారంభమయ్యే వారం
పాట 18 (162)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: సువార్తకున్న ఆచరణాత్మక విలువను నొక్కిచెప్పండి. పరిచర్య పాఠశాల పుస్తకం 159వ పేజీ ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. స్థానిక క్షేత్రంలోని ప్రజలకు ప్రస్తుతం ఏ విషయాలు చింత కలిగిస్తున్నాయో చెప్పమని ప్రేక్షకులను అడగండి. మన అందింపుల్లో ఆ విషయాల గురించి ఎలా మాట్లాడవచ్చో సలహాలిమ్మని అడగండి.
20 నిమి: “మీ కుటుంబం తప్పించుకోవడానికి సిద్ధమవుతోందా?”b సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 1 (13)
జూన్ 23తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
10 నిమి: స్థానిక ప్రకటనలు. సంఘ జమాఖర్చుల వివరాలను, సంఘం పంపించిన విరాళాలు అందినట్లు తెలియజేస్తూ సంస్థ పంపిన ఉత్తరాన్ని చదవండి. జూలైలో అందించవలసిన సాహిత్యాన్ని ప్రస్తావించి, ఒక అందింపును ప్రదర్శించండి.
20 నిమి: క్రమ పయినీరు సేవతో అర్థవంతమైన జీవితం. కావలికోట జనవరి 15, 2008, 17-19 పేజీల ఆధారంగా ఇవ్వబడే ప్రసంగం. సంఘంలో క్రమ పయినీర్లు ఉంటే, ఈ మధ్య క్రమ పయినీరు సేవ ప్రారంభించిన ఒకరిని, అనేక సంవత్సరాలుగా క్రమ పయినీరు సేవ చేస్తున్న మరొకరిని ఇంటర్వ్యూ చేయవచ్చు. ఈ అమూల్యమైన సేవ చేయడం ద్వారా తమ జీవితాలు ఎలా అర్థవంతమయ్యాయో చెప్పమనండి.
15 నిమి: ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పుడు బైబిలును ఉపయోగించండి. పరిచర్య పాఠశాల పుస్తకం 143-4 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. స్థానిక క్షేత్రంలో ప్రజలు సాధారణంగా అడిగే ఒక ప్రశ్న ప్రచారకునికి వేయబడితే ఆయన దానికి సమాధానమివ్వడానికి బైబిలు ఉపయోగించడాన్ని చూపించే క్లుప్త ప్రదర్శనను చేర్చండి.
పాట 10 (82)
జూన్ 30తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్ నెల క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. 4వ పేజీలోని సూచనలను లేదా మీ క్షేత్రానికి అనువైన వేరే అందింపులను ఉపయోగించి, జూలై-సెప్టెంబరు కావలికోటను ఎలా ఇవ్వాలో ప్రదర్శించండి.
20 నిమి: సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు? పరిచర్య పాఠశాల పుస్తకం 62వ పేజీ 4వ పేరా నుండి 64వ పేజీ చివరి వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ఆ సమాచారాన్ని స్థానిక క్షేత్రానికి అనుగుణంగా అన్వయించండి. ఇంటింటి పరిచర్యలోనైనా, తటస్థ సాక్ష్యమిస్తున్నప్పుడైనా ప్రజలు సులభంగా సంభాషించేలా చేయగల సామర్థ్యమున్నట్లు పేరుగాంచిన ప్రచారకుణ్ణి క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
15 నిమి: మీరు బైబిలు అధ్యయనం ప్రారంభించగలరా? ప్రేక్షకులతో చర్చ. బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అందించండి. పుస్తకానికి సంబంధించిన కొన్ని విశిష్టమైన అంశాలను పునఃసమీక్షించండి. మొదటి సందర్శనంలో ఆసక్తి చూపించినవారి దగ్గరకు మళ్ళీ వెళ్ళినప్పుడు, పత్రికలు ఇచ్చినవారి దగ్గరకు మళ్ళీ వెళ్ళినప్పుడు, ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు దాన్నెలా అందించాలో చర్చించండి. (km-TU 8/07 3వ పేజీ; km-TU 1/06 3-6 పేజీలు చూడండి.) ఒకటి రెండు అందింపులను ప్రదర్శింపజేయండి.
పాట 2 (15)
జూలై 7తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “గృహస్థులు మరో భాష మాట్లాడేవారైతే ఏమి చేయాలి?”c ఈ భాగాన్ని సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. రెండవ పేరా చర్చిస్తున్నప్పుడు, మీ సంఘానికి నియమించబడిన క్షేత్రంలోనే పరిచర్య చేస్తున్న వివిధ భాషా గుంపుల లేదా సంఘాల గురించి తెలియజేయండి. వివిధ భాషా గుంపులు లేదా సంఘాలు పరిచర్యలో పరస్పరం సహకరించుకోవడానికి సహాయం చేసే నిర్దిష్ట ఏర్పాట్లు ఏవైనా చేయబడితే వాటిని సమీక్షించండి.
పాట 4 (43)
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.