కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/08 పేజీ 4
  • మీ జీవితం ఆశీర్వదించబడుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ జీవితం ఆశీర్వదించబడుతుంది
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    మన రాజ్య పరిచర్య—2003
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పయినీరింగ్‌ కొరకైన ద్వారం మీ కోసం ఇప్పుడు తెరవబడి ఉందా?
    మన రాజ్య పరిచర్య—1999
  • ప్రకటించవలసిన సమయం ఇదే!
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 5/08 పేజీ 4

మీ జీవితం ఆశీర్వదించబడుతుంది

1 మీరు జీవితంలో గొప్ప సంతృప్తిని పొందాలనుకుంటున్నారా? ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు ఆనందాన్ని పొందాలనుకుంటున్నారా? యెహోవా సేవను ఎక్కువగా చేయాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నల్లో దేనికైనా అవును అనేదే మీ సమాధానమైతే, మీరు క్రమ పయినీరు సేవను చేపట్టవచ్చు. నిజమే, అందరూ పయినీరు సేవను చేపట్టలేరు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, ఇతర లేఖనాధార బాధ్యతలతోపాటు, ఆరోగ్యాన్ని, శారీరక పరిమితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

2 దైవప్రేరేపితుడైన సొలొమోను తన రచనల్లో యెహోవా ఆశీర్వాదాన్ని వస్తుపరమైన ఐశ్వర్యంతో ముడిపెట్టాడు. (సామె. 10:22) యెహోవా నేడు ప్రాథమికంగా ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్నిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు క్రమ పయినీర్లకు సమృద్ధిగా లభిస్తాయి. ఉదాహరణకు వారు, తమ సొంత పనులకు వెచ్చించే ‘సమయాన్ని సద్వినియోగం చేసుకొని,’ ఇతరులకు ఇవ్వడంలోని అంటే ఇతరులకు సహాయం చేయడంలోని గొప్ప ఆనందాన్ని వారు చవిచూస్తున్నారు. (కొలొ. 4:5; అపొ. 20:35) వారు చేస్తున్న ప్రేమపూర్వక కృషిని యెహోవా గమనించి, మెచ్చుకుంటాడు. అలా ‘పరలోకంలో సమకూర్చుకున్న ధనం’ విలువ ఎన్నటికీ తగ్గదు. (మత్త. 6:20; హెబ్రీ. 6:10) అంతేకాక, పయినీర్లు తమ ‘కంటిని తేటగా’ ఉంచుకుంటూ, తమ అవసరాలను యెహోవా తీరుస్తాడనే నమ్మకంతో ఉండడం ద్వారా వారికి ఆయనతో ఉన్న సంబంధం బలపడుతుంది.—మత్త. 6:22, 25, 32; హెబ్రీ. 13:5, 6.

3 వస్తుపరమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం కోసం వెంపర్లాడడం తరచూ ‘అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలకు’ దారితీస్తుంది. (1 తిమో. 6:9, 10; యాకో. 5:1-3) కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదం విషయంలోనైతే అలా కానేకాదు. క్రమ పయినీర్లు ప్రకటనా పనిలో ఎక్కువ సమయం వెచ్చిస్తారు కాబట్టి, వారు శ్రేష్ఠమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు. (ఫిలి. 1:9, 10) ఒక సహోదరుడు పయినీరు సేవ చేయడానికి తన సమయాన్ని హరించివేసే ఇంజనీరు వృత్తిని వదిలిపెట్టాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను ఉద్యోగంవల్ల చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాను. పయినీరు సేవలో అలాంటి ఒత్తిడి లేదు. నా దగ్గర ఇప్పుడు, ప్రజలకు సత్యాన్ని బోధించడానికి చాలా సమయముంది. ప్రజలు సత్యానికి స్పందించేలా సహాయపడడం ద్వారా ఉద్యోగంలో పొందలేని సంతృప్తిని ఇప్పుడు పొందగలుగుతున్నాను. నిజంగా ఈ పని ఎంతో ఆసక్తికరమైనది.”

4 ఇతరులకు ఆశీర్వాదకరం: నేడు మనందరం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. (2 తిమో. 3:1) ప్రజలందరికీ నిరీక్షణ ఎంతో అవసరం. నిరీక్షణ లేని ప్రజలు సువార్త గురించి తెలుసుకొని, దాని ప్రకారం నడుచుకొనేలా వారికి సహాయపడినప్పుడు రాజ్య ప్రచారకులు గొప్ప ఆనందాన్ని పొందుతారు. జీవితాలను రక్షించే ఈ పనిలో ప్రతీ సంవత్సరం 800 గంటలను వెచ్చించడం క్రమ పయినీర్లకు ఎంతో ఆనందాన్నిస్తుంది.—1 తిమో. 4:16.

5 క్రమ పయినీరు సేవ చేయడం గురించి మీరు గంభీరంగా ఆలోచిస్తున్నారా? అలా సేవ చేయడానికి, అంత ప్రాముఖ్యంకాని వాటి నుండి ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకోవాల్సిరావచ్చు. (ఎఫె. 5:15, 16) చాలామంది అలా సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిరాడంబరంగా జీవిస్తున్నారు. అలా చేయడం వల్ల వారు ఉద్యోగాల్లో తక్కువ సమయం గడుపుతూ పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతున్నారు. మీరు కూడా పయినీరు సేవ చేయడానికి మీ కార్యకలాపాలను సర్దుబాటు చేసుకోగలరా?

6 ఆచరణాత్మకమైన పట్టికను వేసుకోవడానికి జ్ఞానాన్నివ్వమని యెహోవాను వేడుకోండి. (యాకో. 1:5) అలా చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి? ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు భౌతికంగా మీకు అవసరమైనవాటితో కూడా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. (మత్త. 6:33) ఈ విషయంలో యెహోవాను శోధించేవారిపై ‘పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించబడతాయి.’—మలా. 3:10.

[అధ్యయన ప్రశ్నలు]

1. క్రమ పయినీరు సేవ చేపట్టడాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి?

2. క్రమ పయినీర్లు పొందే కొన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలేమిటి?

3. వస్తుపరమైన ఐశ్వర్యం కోసం వెంపర్లాడడానికి, ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం పాటుపడడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసముంది?

4. క్రమ పయినీర్లు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు వారెలా ఆశీర్వదించబడ్డారు?

5, 6. క్రమ పయినీరు సేవ చేయడానికి ఏది మీకు సహాయం చేయగలదు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి