కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/08 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఉపశీర్షికలు
  • మే 12తో ప్రారంభమయ్యే వారం
  • మే 19తో ప్రారంభమయ్యే వారం
  • మే 26తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2008
km 5/08 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మే 12తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సూచనను లేదా మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనను ఉపయోగించి, ఏప్రిల్‌-జూన్‌ కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శించండి.

15 నిమి: మనం ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవచ్చు! కావలికోట జూన్‌ 15, 2005, 30-1 పేజీల ఆధారంగా ప్రసంగం. ఫలానా పరీక్షను ఎదుర్కోవడానికి యెహోవా తమకెలా సహాయం చేశాడో చెప్పమని ప్రచారకులను ముందుగా ఏర్పాటు చేసుకోండి.

20 నిమి: వేసవి సెలవుల్లో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? ప్రేక్షకులతో చర్చ. సహాయ పయినీరు సేవ చేయడానికి కావలసిన అర్హతలను తెలియజేస్తూ సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 112-13 పేజీలను సమీక్షించండి. ఉద్యోగం చేసేవారు సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేయడంవల్ల వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారో చెప్పమని అడగండి. స్కూలు సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేసిన వారిని ఇతరులు తమనెలా ప్రోత్సహించి, సహకరించారో చెప్పమని అడగండి. యెహోవాకు సన్నిహితమయ్యేందుకు సహాయ పయినీరు సేవ వారికెలా సహాయం చేసింది? వారెలాంటి ఆనందాల్ని పొందారు? వేసవి సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేయమని అర్హులైన వారందరినీ ప్రోత్సహించండి.

పాట 17 (187)

మే 19తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగాన్ని సమీక్షించండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

25 నిమి: “‘మీరెలా ప్రత్యుత్తరమివ్వాలో తెలుసుకోండి.’”a దీనిని ఒక పెద్ద నిర్వహించాలి. క్షేత్రంలో సాధారణంగా ఎదురవగల ఆక్షేపణకు కృపాసహితమైన పదాలతో ఎలా ప్రత్యుత్తరమివ్వాలో ప్రదర్శింపజేయండి.

పాట 7 (51)

మే 26తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. మే క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి.

15 నిమి: “‘మీమీద నా కాడిని ఎత్తికొనుడి.’”b సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి: “మీ జీవితం ఆశీర్వదించబడుతుంది.”c సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 113-14 పేజీల్లో ఇవ్వబడిన క్రమ పయినీరు సేవ చేయడానికి కావలసిన అర్హతలను సమీక్షించండి. సెప్టెంబరు 1 నుండి పయినీరు సేవ చేపట్టాలని కోరుకునేవారు తమ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి.

పాట 21 (191)

జూన్‌ 2తో ప్రారంభమయ్యే వారం

పాట 27 (221)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: నమ్మకమైనవారికి దీవెనలు మెండుగా కలుగును. (సామె. 28:20) సంఘ కార్యదర్శి ఇచ్చే ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో పరిచర్యను విస్తృతపరచుకోవడానికి సంఘం చేసిన కృషిని యెహోవా ఎలా ఆశీర్వదించాడో వివరించి, సంఘంలోని వారిని మెచ్చుకోండి. సహాయ పయినీరు సేవను ఎంతమంది చేశారో, ఎన్ని బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయో, పరిచర్యలో సాధించిన ఇతర మంచి ఫలితాలేమిటో తెలియజేయండి. జ్ఞాపకార్థ ఆచరణకు, ఆహ్వానప్రతులు పంచిపెట్టే ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ఎదురైన అనుభవాలను తెలియజేయమని ప్రేక్షకులను కోరండి. క్షేత్ర సేవలో ఎదురైన మంచి అనుభవాలను పునర్నటింపజేయవచ్చు. సహాయ పయినీరు సేవ చేయడం వల్ల ఆశీర్వాదాలు పొందిన ఇద్దరు లేదా ముగ్గురిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.

15 నిమి: “‘ప్రతీ సత్కార్యానికి సిద్ధంగా ఉండండి.’”d ఇంటింటి పరిచర్యకు ఎప్పుడు, ఎలా సిద్ధపడతారో ప్రేక్షకులను చెప్పమనండి.

పాట 5 (46)

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి