కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/08 పేజీలు 7-8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2008
మన రాజ్య పరిచర్య—2008
km 4/08 పేజీలు 7-8

ప్రకటనలు

▪ అందించాల్సిన ప్రచురణలు ఏప్రిల్‌, మేలలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు, ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి మాత్రమే హాజరై సంఘ కూటాలకు క్రమంగా రాని ఆసక్తిగల కొత్తవారిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేయాలి. వారిలో ఎవరైతే బైబిలు అధ్యయనం చేయడంలేదో వారికి మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్నిచ్చి గృహ బైబిలు అధ్యయనం చేయాలనే లక్ష్యంతో వారిని సందర్శించాలి. జూన్‌లో: అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి.

▪ 2008 జిల్లా సమావేశ బ్యాడ్జి కార్డులు 2008 మే నెలకల్లా మీ సంఘాలకు పంపించబడతాయి. అన్ని సంఘాలకు వాటివాటి భాషల్లో, ప్రచారకుల సంఖ్యకన్నా ఎక్కువ మొత్తంలో పంపించబడతాయి. అంతకంటే ఎక్కువగానీ, వేరే భాషలో గానీ అవసరమైతే తప్ప సంఘాలు వాటి కోసం రిక్వెస్ట్‌ చేయనవసరం లేదు. తగినన్ని బ్యాడ్జిల కోసం లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ను (S-14) నింపి బ్రాంచి కార్యాలయానికి పంపించాలి.

▪ అప్లికేషన్‌ ఫర్‌ రెగ్యులర్‌ పయినీర్‌ సర్వీస్‌ (S-205) ఫారాలూ, అప్లికేషన్‌ ఫర్‌ ఆగ్జిలరీ పయినీర్‌ సర్వీస్‌ (S-205b) ఫారాలూ సంఘంలో కావలసినన్ని ఉండేలా సంఘ కార్యదర్శులు చూసుకోవాలి. ఈ ఫారాలను లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-14) ద్వారా ఆర్డర్‌ చేయాలి. సంవత్సరానికి సరిపడే ఫారాలు అందుబాటులో ఉండేలా చూసుకోండి. క్రమ పయినీరు దరఖాస్తులను బ్రాంచి కార్యాలయానికి పంపే ముందు వాటిలో వివరాలన్నీ నింపబడేలా చూడండి.

▪ సంఘ పైవిచారణకర్తలు, కార్యదర్శులందరి చిరునామాలనూ టెలిఫోన్‌ నంబర్లనూ బ్రాంచి కార్యాలయం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. కాబట్టి చిరునామా లేదా టెలిఫోన్‌ నంబరు మారితే సంఘ సేవా కమిటీ, ప్రిసైడింగ్‌ ఓవర్‌సీయర్‌/సెక్రటరీ ఛేంజ్‌ ఆఫ్‌ అడ్రస్‌ ఫారమ్‌ను (S-29) పూరించి, సంతకం చేసి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. టెలిఫోన్‌ ఎస్‌టిడి కోడ్‌లు మారితే వాటిని కూడా తెలియజేయాలి.

▪ మీరు స్వంత పనులమీద విదేశాలకు వెళ్తున్నప్పుడు, ఆ దేశంలోని సంఘ కూటాలకుగానీ, ప్రాంతీయ సమావేశానికిగానీ, జిల్లా సమావేశానికిగానీ హాజరవ్వాలనుకుంటే, వాటి తేదీల, సమయాల, చిరునామాల గురించిన సమాచారం కోసం మీరు వెళ్ళే దేశాన్ని పర్యవేక్షించే బ్రాంచి కార్యాలయానికే వ్రాయాలి. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు తాజా వార్షికపుస్తకము (ఆంగ్లం)లోని చివరిపేజీలో ఉన్నాయి.

▪ మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాలు అన్ని సంఘాలకు పంపించబడతాయి. ఆ కరపత్రాలను మీతో తప్పనిసరిగా తీసుకువెళ్ళి, కొత్త బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి వాటిని ఉపయోగించండి. వ్యతిరేకత ఉన్న ప్రదేశాల్లో మొదట గృహస్థులకు ఆసక్తి ఉందోలేదో గ్రహించి, తగినప్పుడు కరపత్రాన్ని ఇవ్వండి.

▪ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను ​—⁠బెంగాలీ

“నా బైబిలు కథల పుస్తకము” కోసం అధ్యయన ప్రశ్నలు ​—⁠గుజరాతీ, బెంగాలీ, మరాఠీ

సంఘ పుస్తక అధ్యయనాల కోసం పైన ప్రస్తావించబడిన ప్రశ్నా బుక్‌లెట్‌ని ఆర్డర్‌ చేయాలని సంఘాలు కోరబడుతున్నాయి. దయచేసి మీ ఆర్డర్‌ను ఏప్రిల్‌ లిటరేచర్‌ రిక్వెస్టుతో పాటు పంపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి